స్వార్ధం తెచ్చిన నష్టం

స్వార్ధం తెచ్చిన నష్టం

-కార్తీక్ దుబ్బాక

పూర్వం కాటమ రాజు,అనె రాజు,నలగామరాజ్యాన్ని పాలిస్తున్నాడు,తన ప్రజల్లో స్వార్థంలేకుండా చెయ్యాలి అని, రాజు నిశ్వార్థంగా ప్రజా పాలన చేసేవాడు, ప్రజలు నిస్వార్ధం గాఉండే వారు రోజుల్లో. *ఆ రాజ్యం లో * ప్రతి వాళ్ళు నిస్వార్థం తో, స్నేహ పూర్వక సంబంధాలతో జీవించేవారు.

ఆ రోజుల్లో చదువు లేకపోయిన,వాళ్లలోజాలిగుణం దయ గుణం ఎక్కువ ఉండేటట్లు పాలించే వాడు .
కరెంట్,రహదారులు లేని గ్రామాలు.సరిగా కాలిదారి కూడాఉండేదికాదు.మనుషుల్లో ఐకమత్యంఉండేది,ఒకపల్లెనుండి,వేరేపల్లెకివెళ్లాలంటేవాహనాలు ఉండేవికావు,కాలి నడక తో ఎంత దూరం అయినా వెళ్లే వాళ్ళు.
గ్రామ, గ్రామాలు దాటు తు వెల్లుతూ ఉండే వారు , బ్రతుకు బాటలో భయమే లేని పాలనా ఉండేది కాటమ రాజు రాజ్యం లో.స్వార్థం లేని జీవితాలు ఆ రాజ్య ప్రజలివి.ఒకరికి ఒకరు చేదోడు, వాదోడు గా ఉండే వారు రాజ్యం ప్రజలు.
రాజుగారు, ప్రజలబాగోగులు తెలుసు కుందామని మారు వేషం లో ప్రతి రాత్రి ఏదో్ ఒక గ్రామం వెళ్ళుతుండేవాడు, ప్రజలలో కలిసి పోయి రాజ్యా పాలనా అడిగే వాడు. ప్రజల సంతోషం జీవితం విని చాలా ఆనందించే
వాడు.
ఒక రోజు రాజు గారికి అనుకోని సంఘటన ఒకటి ఎదురైంది. రాజు గారు తను ఉండే చోట మంచిగా రోడ్డులు వేయించు కొని మాకు దారులు
లేకుండా ఉన్నా పట్టించు కోవడం లేదు అన్న వార్త ఆది.
రాజు గారు, అన్నీ గ్రామాలకు రహదారులు వేయించాలి అని, ఆస్థాన మంత్రులు లను తన ఆజ్ఞవేసాడు.రహదారులు
కొద్దిరోజుల్లోనేపూర్తిచేయించాడు,మరికొంతకాలనీకిరాజుగారు,ప్రజల మనోభావాలు తెలుసు కోనేందుకు మరల మారు వేషం
లో తిరుగు తున్నాడు…
మరల రాజు గారిని విమర్శ
చేస్తూ ఒక బాట సారి, తన ఆలోచన బయట పెట్టాడు రహ దారులు ప్రక్కన తాగునీరు లేక ప్రయాణికులు చాలా బాధ లు పడుతున్నారు అనిచెప్పాడు…
అప్పుడు రాజుగారు, దారులు వెంట అక్కడక్కడ బావులు తవ్వించేశాడు,
ప్రజల బాగోగులే పరమావధిగా
పాలనా చేస్తున్న రాజుగారికి, ప్రతి రోజు ఒక సమస్య ద్రుష్టి కి రావడం, దాన్ని పరిష్క రించడం జరుగుతుంది….
దారి వెంబడి పండ్ల మొక్కలు నాటి బాట సారుల
ఆకలి తీర్చి, నీడ వసతులు కలిపించి, ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా పరి పాలనా చేస్తున్నాడు…..
ప్రతి గ్రామం లో సత్రాలు నిర్మించి దూర ప్రయానికులకు
రాత్రుళ్ళు విడిది ఏర్పాట్లు చేసాడు… ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసి మెలిసి జీవిస్తున్నారు. సుఖ, సంతోషాలతో ఉంటున్నారు.
అలాంటి సుఖ సంతోషం ల రాజ్యం లో, ప్రక్క రాజ్యపు రాజు అయినా కరోటా రాజ్యపు రాజు, కర్కోటక రాజు,
స్వార్థంగా అలోచించి,కాటమ రాజురాజ్యంలోకి ,తనవేగులనుపంపి,రాజుగారికివ్యతిరేక ప్రచారాలు, తిరుగు బాటును లేవనెత్తిప్రజలను,రాజుకివ్యతిరేకంగామార్చేసాడు…
కాటమ రాజుకి ఏమి అంతుచిక్కడంలేదురాజ్యంలో , స్వార్ధం పెరిగి పోయింది,ప్రజల్లో
జాలి, దయ కనిపించడం లేదు.
చిన్న పెద్ద బేధం లేదు, ఒకరికి ఒకరు బద్దశత్రువులు గా మారారు, దేశంలో అల్లకల్లోలం
జరుగుతుంది.ఒకరు ఒకరి కి పడటం లేదు, ఒకరికి ఒకరు సహాయం మాట మరిచారు.
స్వార్థం లేకుండా ఉన్న ప్రజల్లో,ఇంత గా మార్పులు
ఎలావచ్చాయి అని తెలుసు కోవడానికి, మరల మారు వేషం లో రాత్రుళ్ళు తిరిగి, అసలు కారణం తెలుసు కున్నాడు కాటమ రాజు.

కాటమ రాజు, కర్కోటా రాజు చేసినదుశ్చర్యలుతెలుసు కున్నాడు,కర్కోటక రాజుచేసిన స్వార్ధ రాజకీయంవలన, నా రాజ్యంలోమనుషులుస్వార్థంగా
మారారు. అతనికి గట్టిగ బుద్ధి చెప్పాలని తల్చి, కర్కోటా రాజ్యం పై దండయాత్ర చేసి, కర్కోటక రాజుని బంధించి ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యం లో కలిపి వేసాడు….
కర్కోటక రాజుని ఉరి తీయించి, శత్రు శేషం లేకుండా
చేసుకున్నాడు, తన రాజ్య ప్రజల కు భూత దయ ఉండాలి అని ప్రచారం చేయించాడు
స్వార్థంవీడిబ్రతకాలనిబోధించాడు.స్వార్థం మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చూపించాడు.
మనుషులు స్వార్థం వీడి జీవించాలని..
అందరం, ఒక్కరి కోసం, ఒక్కరు అందరికోసం, బ్రతకాలని బోధించాడు.,..
స్వార్థం పతనానికి కారణంఅని ప్రజల కు తెలియ
జేసి నిస్వార్ధ పాలన ప్రజలకు అందించాడు కాటమ రాజు.

(స్వార్థం చేసే కీడు ఈ కథ లో నీతి )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!