మార్పు

మార్పు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఏదో సాధించాలన్న ఆశ మనసులో ఉంది. కానీ, అందరికీ అవకాశాలు అందుబాటులో ఉండవు. అలాగని నిరాశ, నిస్పృహలతో సమయం వృధా చెయ్యటం సమంజసం కాదు అనేది నా ఉద్దేశ్యం.

బయట పరిస్థితి మనకు అనుకూలంగా లేదు. నువ్వు ఎందుకు వాళ్ళని ఆలా బయటకు తీసుకు వెళతావు అంటూ మా వారి వాదన.

అవును, కానీ ఎన్ని రోజులు ఇలా?? చదువు లేకపోతే ఎలా? పైగా వాళ్ళల్లో ఉండాల్సిన చలాకీ తనం ఏది? ఎప్పుడూ సెల్ ఫోన్, టీవీ ల ముందు కూర్చుంటే… అప్పుడు కూడా వాళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇంట్లో ఉన్నా ఏమి జరగదు అని గ్యారంటీ లేనప్పుడు, ధైర్యంగా ముందడుగు వేయటమే మంచిది అన్నాను మొండిగా.

ఇప్పుడు వాళ్ళు స్కూల్ కి ఎందుకు? ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు కదా?

ఎంత ఆన్ లైన్ క్లాసులు విన్నా, క్లాస్ రూంలో విన్న పాఠం దారి వేరు అన్నది నా వాదన. అవసరాన్ని బట్టి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అన్నాను.

నువ్వు ఎందుకు ఇలా మాటలాడుతున్నావో నాకు తెలియదు. ఒకప్పుడు నా కంటే నీకే ఎక్కువ భయం ఉండేది. పిల్లల విషయంలో ఏనాడూ తొందర పడలేదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించు అన్నారు దినేష్.

చూడు దినేష్, నాకు తెలిసి మరీ సీరియస్ కండీషన్ అయితే ప్రభుత్వం ఊరుకోదు కదా స్కూల్ తెరిస్తే!!!! అవకాశం ఉన్నప్పుడు మనం వినియోగించుకోవచ్చు. వాళ్ళు స్కూల్ కి వెళితే, నేను నా జాబ్ గురించి ఆలోచించుకోవచ్చు.

ఎవరి గొడవ వాళ్ళది అన్నట్టు, నీకు ఇప్పుడు ఉద్యోగానికి ఏం తొందర వచ్చింది? మాటలో వెటకారం.

నేను మౌనంగా వింటున్నాను.

ఒక పక్క స్టోరీ రైటింగ్, సాయంకాలం అవ్వగానే ట్యూషన్ పాయింట్, ఇంకో పక్క పిల్లల ఆన్ లైన్ క్లాసులు, వాళ్ళ కెరీర్ గురించిన ఏవో ఎక్సామ్స్… ఎన్నని చేస్తావు అన్నారు అనునయంగా.

భాదలో తోడుండేవి

భయంలో బయటపడేవి

మనసు భారం తగ్గించేవి

మన అనుకున్న వారి ముందు వెలువడేవి

    ……….కన్నీళ్ళు…..

ఒకప్పుడు అయితే, నాకు భాద కలిగిన ప్రతి సారీ కళ్ళ నీళ్ళు ఉప్పొంగేవి.

నాకు తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లేవి

ఏమైంది బేలతనం!!!

ఎక్కడికి పోయింది అమాయకత్వం!!!

నన్ను నేను మార్చుకున్నానా!!!

లేదా నా మనసే మూగబోయిందా!!!!

నేను అన్ని చేయగలను. ఏమైనా సాధించగలను. కాదు… కాదు… ఏదో ఒకటి సాధించాలి. మనలో ఉన్న ఆ కొద్దిపాటి విద్య,  మనతోనే అంతమైపోకూడదు. నలుగురికి ఉపయోగపడాలి.  మన జ్ఞానం నలుగురికి తెలియాలి.

నిరాశ దరిచేర కూడదు

నిస్పృహతో మనసు మూగవై పోకుకూడదు

నీలో ఉన్న గొప్పదనం మనం నువ్వు తెలుసుకో

నిన్ను నువ్వు సరిదిద్దుకో

బాధ్యతలను విస్మరించకు

నీ విజయ పయనం ఆపకు

ఓ మగువా మేలుకో

నీలో దాగి ఉన్న ప్రతిభకు

పట్టం కట్టే శుదినం ఇదే అని తెలుసుకో

నువ్వు సాధించలేనిది ఏదీ లేదని నిరూపించుకో

నాలో కలిగిన ఈ మార్పును చూసిన దినేష్, మరి ఇంకా మాట్లాడే సాహసం చేయలేదు.

సరే ఏమి చేసినా నా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ వీలు ప్రకారం చెయ్యి. నీ ఆరోగ్యం,  పిల్లల ఆరోగ్యం విషయంలో మరికొంచెం శ్రద్ధ తీసుకోండి.  అలాగే బయటకు వెళ్ళినప్పుడు తినే వస్తువుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ సందేశం అందించాడు.

సరే అని నవ్వుతూ తల ఊపాను.

నేను కూడా రేపటి నుంచి తిరిగి జాబ్ లో జాయిన్ అవుతున్నాను. అలాగే నేను ఇప్పటివరకు రాసిన నా చిన్న కథలన్నిటినీ కలిపి జీవన సౌగంధం పేరుతో ఒక పుస్తకం ప్రింట్ చేయిద్దామని ఆలోచనలో ఉన్నాను అని చెప్పాను.

సరే నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం.  నాకు కూడా తెలిసిన వాళ్ళు ప్రింటింగ్ సెక్షన్ లో ఉన్నారు.  నేను వాళ్లతో  మాట్లాడతాను. ఆ పని గురించి నేను చూస్తాను అంటూ చిరునవ్వుతో చెప్పాడు.

జీవితంలో మార్పు రావాలి

ఆ మార్పే జీవితాన వసంతం తేవాలి

ప్రేమమయ జీవితం అనేది రావాలి

అందరికీ నీ జీవితం ఆదర్శం కావాలి

మరుసటి ఉదయం. నేను, దినేష్ ఆఫీసుకు, పిల్లలు స్కూల్ కి బయలుదేరాము.

దినేష్ చేతిలో నా రచనల ప్రింట్ కాగితాలు చూసి, నా మనసున ఈ మార్పు అనేది… మంచి ఆరంభంగా నాకు తోచింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!