ఏడడుగుల బంధం

అంశం: ఇష్టమైన కష్టం

ఏడడుగుల బంధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొత్త ప్రియాంక

ఎడడుగులేవేసా నవవసంతమై ప్రేమ చిగురింతలతో మకరందపు మాధుర్యానికై….
ఆశలన్ని ఆవిరై అరణ్యరోదనే మిగిలే ప్రేమ అందించే పడతికి…
ఎదురే చూసే ఎద గాయపు మాన్పే చల్లని లేపనానికై….
నా తలగడ తపించే కన్నీట చెమ్మా తగలని రోజుకై..
తనువెళ్ళ తపనపడే తన
ఆప్యాయత స్పర్శకై….
సంతోషాల పల్లకిలో సుమగంధపు
స్నేహహస్తాన్ని అందుకొని స్వేచ్ఛగా ఊరేగే క్షణానికై….
అగచాట్ల బాట లో ఒంటరిగా పయనిస్తున్న తన మమతానురాగానికై…
సంసారపు సంకెళ్లు నన్ను బంది చేసి వెక్కిరిస్తున్న
వెనకడుగు వేయనులే పెళ్ళి నాటి ప్రమాణానికై….
అనునిత్యం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఇష్టమైన బందానికై….
ఎన్నటికీ చేరేనో నా నివేదన
ఎన్నటికీ  ఆగునో నా నిరీక్షణ?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!