వరదాయిని

వరదాయిని

రచయిత :: చంద్రకళ. దీకొండ


అడగకుండానే నీ మనసు తెలుసుకుంటుంది…
అడిగిన వెంటనే నీ ఆకలి తీరుస్తుంది…!
ఎల్లవేళలా నీ క్షేమాన్నే కాంక్షిస్తుంది…
ఏ చోట నీవున్నా నిరంతర
దీవెనలందిస్తూనే ఉంటుంది…!
నీవు కోరుకున్నవి కొనిపెడుతుంది…
కోరనివి అంతకు ముందే అందిస్తుంది…!
ఎవరు నిన్ను తూలనాడినా సహించదు…
ఎవరైనా నిన్ను విమర్శించినా…ఊరుకోదు…!
నీ ఆశలు తెలుసుకొని నాన్నను ఒప్పిస్తుంది…
నీ ఆశయాలకు తాను తోడై నిలుస్తుంది…!
నీకు ఆపద ఎదురైతే…
తన ప్రాణాల్ని అడ్డు వేస్తుంది…
నీ బాధను మరపించేలా…
సేవలెన్నో చేస్తుంది…!
బదులుగా ఏమీ కోరని అమ్మ…
ఇలలో ప్రత్యక్ష దైవం అమ్మ…
ఆమెను మించిన వరదాయిని వేరెవ్వరు…?!?!?!
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!