విశ్వంతో అనుబంధం

విశ్వంతో అనుబంధం

అంశం – నిన్ను దాటి పోగలనా

గగన సౌధపు రారాజుల్లారా
విశ్వాన్ని ఏలే మహాశక్తి కూటములారా
మీరు లేని అనంత విశ్వమేలా
మిమ్మల్ని దాటే సాహసం మాకేలా

మార్గాన్ని చూపించు ఓ భానుడా!!
నీ కాంతులు లేని జగమేలా
నీవు లేనిదే దాటగలనా ఏ దిశనైనా

చల్లని వెన్నెల పంచు ఓ చంద్రమా!!
నీ రాక లేనిదే కునుకు రాదమ్మ
నిన్ను దాటి పోగలనా ఏనాటికైనా కమ్మని తిమిరపు కలల సౌధానికి

ఓ విశ్వనాయకా…సర్వేశ్వరా!!
నిన్ను దాటి పోగలనా నిమిషమైన విశ్వంలోని ఏ మూలకైనా
నీ గడప దాటనిదే ఆత్మ పునీతమవునా ఏ దేహానికైనా సర్వజనవిశ్వరక్షకా..!!

రచయిత :: అలేఖ్య రవికాంతి

You May Also Like

4 thoughts on “విశ్వంతో అనుబంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!