ప్రియసఖీ!
రచన: పరిమళ కళ్యాణ్
కన్నుల్లో నీ రూపమే!
గుండెల్లో నీ ధ్యానమే!!
రెప్పపాటులో మాయమైనావు
కంటికి కునుకే దూరం చేసావు!
కలలోన కనిపించి కవ్విస్తావు
ఇలలోన నాకెపుడు ఎదురౌతావు!
నీ ధ్యాసే నను వెంటాడుతూ ఉన్నా
నా నీడై నువ్వే నను వేధిస్తావు!
నే కవినైనా కాకపోతిని
నీ రూపు వర్ణించగా!
పాటైనా పాడలేక
గొంతు మూగబోయేనే!
నీ కోసం వెతికి వెతికి వేసారెనే
ఇకనైనా దరిచేరి నను కరుణించవే!
ప్రియసఖీ నీకిది న్యాయమా
తెర విడి నన్నిక చేరుమా!
నిను చూడక నే నిలువగలనా!
నువ్ కానరాక వేచుండ గలనా!
దాగుడు మూటలు చాలించవా!
మన్నించి నను నీ దరి చేర్చుకోవా!!
