నేటి రాజకీయం

నేటి రాజకీయం

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

సెటిలవ్వరా సెటిలవ్వరా అంటూ సెటిల్ మెంట్ లనే వృత్తిగా చేసేశారు కదరా అంటూ వెంకట్ తెగ ఫీలయిపోతూనే దౌర్జన్యంతో బతికేస్తున్నాడు.వెంకట్ మాటలు వింటే మనం జీవితంలో మనకిష్టమైన పనులు చేయకుండా బంధువులు,మిత్రులకు నచ్చే పనులను చేస్తూ ఇతరులకోసమే జీవిస్తున్నాం అనిపిస్తుంది.వాడికిష్టం లేకపోయినా ఏదో ఒక ఫీల్డ్ లో సెటిలవ్వాలనే తాపత్రయంతో సెటిల్ మెంట్ జనార్థన్ దగ్గర చేరి సంపాదిస్తూ ఉన్నాడు.

పెళ్ళీడొచ్చినా వీడి రౌడీ బ్యాగ్రౌండు చూసి ఎవరూ పిల్లనివ్వట్లేదు.ఈ జీవితం ఇంతేనా నేను బ్రహ్మచారిగా మిగిలిపోవల్సిందేనా అనుకుంటూ ఉండగా వెంకట్ ఫ్రెండ్ శరత్ “ఒరేయ్ ఎవరో ఒకర్ని లైన్లో పెట్టరా తర్వాత పెళ్ళి “అంటూ సలహా ఇచ్చాడు.మనకెవరు పడతార్రా గూండా గిరీ చేసే వాడికి అని వెంకట్ అంటుండగానే శరత్”ఈ రోజుల్లో రౌడీలనే అమ్మాయిలు ప్రేమిస్తున్నార్రా” అంటూ ఎంకరేజ్ చేయడంతో వెంకట్ ఆ వీధిలో బ్యూటీ క్వీన్ దీపిక కి లైన్ వేస్తూ ఉండగా సెటిల్ మెంట్ జనార్థన్ వచ్చి ఏరా ఇక్కడ తిరుగుతున్నావ్ అదెవరనుకుంటున్నావ్ నా మరదలు.దానెనక తిరిగావో చర్మం వొలిచేస్తా అనడంతో వెంకట్ ఆశ్చర్యంతో జనా అన్నకి నా గురించి తెలిసి కూడా నాకే వార్నింగ్ ఇచ్చాడు . నేనెలాగైనా జనా కంటే పలుకుబడి సంపాదించి దీపిక నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.పాపులర్ ఎలా అవ్వాలా అని ఆలోచిస్తూ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూసి సోషల్ నెట్వర్క్ ద్వారా పాపులర్ అవ్వాలని అనుకుంటాడు.
ఫ్రెండ్స్ తో కలిసి సేవా సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆరు నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటాడు.సోషల్ మీడియాలో వెంకట్ వీడియోలు వైరల్ అవుతూ చివరికి ఎం.ఎల్.ఎ గా పోటీ చేయమనే రేంజ్ కి చేరుకుంటాడు.
ఎలక్షన్స్ లో ఏ పార్టీ వారు సీటివ్వక పోవడంతో ప్రజలతో మమేకమై ఇరవై రోజుల ప్రణాళికతో సమస్యలను తన చానెల్ లో వివరిస్తూ ఎలా పరిష్కరిస్తాడో కూడా రివీల్ చేస్తూ తన మేనిఫెస్టో ని సపరేట్ గా రిలీజ్ చేసి ఇండిపెండెంట్ గా నిలబడతాడు.ఇతర పార్టీలన్నీ వెంకట్ ఐడియాలజీకి ఫిదా అయిపోయి మనం సీటివ్వక తప్పు చేశామని ఫీలవుతూ ఉంటారు.జనార్థన్ ఒక పార్టీ తరపున నిలబడతాడు.పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో వెంకట్ భారీ మెజారిటీతో గెలవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.ఎందుకంటే రౌడీ బ్యాక్ గ్రౌండ్ తో మంచితనమనే పూత పూసుకొని గెలిచిపోయాడనే అసూయ.సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారే గెలవం కామన్.నేటి రాజకీయం అంతేగా అంతేగా అనుకున్నారు అందరూ. వెంకట్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వక తన పంథాని కొనసాగిస్తూ ప్రజల సమస్యలను అసెంబ్లీ లో వినిపిస్తూ సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా ఎదిగాడు.

దీపిక ను లవ్ చేస్తున్నానని చెప్పకుండా పనిలో నిమగ్నమై ఉండగా దీపిక వచ్చి వెంకట్ తో ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు అనడంతో వెంకట్ “ఐతే ఏం చేయమంటావ్”అన్నాడు.ఒకసారి తలయెత్తి చూసి చెప్పు అన్నది.వెంకట్ తమాయించుకొని దీపిక కళ్ళల్లోకి చూసి దీపూ నువ్వా అంటూ రేపే మీ ఇంటికి వచ్చి పెళ్ళి సంబంధం మాట్లాడుతా.ఈ జీవితం నీకే అంకితం దీపూ అంటూ ఐ లవ్ యూ అని కౌగిలించుకుంటాడు.శరత్ గబుక్కున వచ్చి చూసి పెళ్ళికి ముందే ఏదో జరిగిపోతుందే అనడంతో ఇద్దరూ సిగ్గుపడుతూ చెరో పక్క గోడకి అతుక్కుపోయారు.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!