మనిషి – మనసు

మనిషి – మనసు

రచన: శిరీష వూటూరి

మనిషికీ,మనసుకీ
నిరంతరం సంఘర్షణే….

సమాజం పోకడలతో
పోటీ పడుతుంటాడు మనిషి
సుతి మెత్తని తలపులతో
కలవరపడుతుంది మనసు

వేవేల ఆలోచనలతో
సతమవుతుంటాడు మనిషి
మనిషిని సంతృప్తి పరచలేక
ఓడిపోతుంటుంది మనసు

కోరికల వలలో చిక్కుకొని
బందీ అవుతాడు మనిషి
తెలిసి కూడా ఆపలేక మౌనంగా
ఉండిపోతుంది మనసు

మనిషిది గెలవాలన్న ఆరాటం
మనసుది మనిషిగా గెలిపించాలన్న
తపనతో కూడిన మానసిక పోరాటం….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!