సంప్రదాయక ప్రగతి
రచన; పి. వి. యన్. కృష్ణవేణి
సాంప్రదాయికంగా అగుపించు
నాగరికతకు ప్రక్షాళన గావించు
అర్దం లేని చేష్టలను అధిగమించు
హిందూ ధర్మాన్ని తప్పక ఆచరించు
గుండ్రటి బొట్టు ముఖానికి అందం పెంచు
ఎర్రటి తిలకం నీ వన్నెను పెంపొందించు
వన్నెచిన్నెలు ప్రధానం కాదని భావించు
సంప్రదాయంలో ఉన్న గౌరవాన్ని స్వీకరించు
ఎన్నో వేల కుటుంబాలుగా మారెను
ఈ ప్రపంచమే ఆనందమయం అయ్యెను
మరెన్నో సదుపాయాలతో నిండెను
ఎక్కడ చూసినా ఆనందం తాండవించెను
సుఖ జీవనం కోసం భంధుత్వాలను మరచెను
సదుపాయాల పేరుతో ప్రజలు
ఉమ్మడి కుటుంబాలకు దూరమయ్యెను
ఇదే స్వేచ్చకు ప్రతీక.. ఇదా మన ప్రగతి
నిన్ను నువ్వు నమ్ముకుని ముందుకు సాగు
నీ పయనం నువ్వు సాగించు
నీ దారి నీదిగా నువ్వు సాగిపో
విజయం నీ చెంతకే చేరు చూడు
ధైర్యం వీడకు నీ గుండెలోన
వెనుకంజ వేయకు జన్మలోన
పలువురితో పోల్చుకోకు నువ్వు
నీపై నమ్మకమూ నువ్వు వీడిపోకు