ఆరోగ్య చిహ్నం

ఆరోగ్య చిహ్నం

రచన: జె వి కుమార్ చేపూరి

సంతోషానికి బాహ్య సంకేతం నవ్వు
ఆనంద భావపు వ్యక్తీకరణం నవ్వు
దరహాసానికి ధనమక్కర లేదు
మందహాసానికి మనీతో పనిలేదు

నేస్తమా నవ్వితే నష్టమేముంది
నీ నవ్వు విరోధిని మిత్రునిగా చేస్తుంది
నీ క్షణికమైన కోపం కష్టాలు కొని తెస్తుంది
చెలికాడిని శత్రువుగా మారుస్తుంది

చిన్నారి బోసి నవ్వు మైమరపిస్తుంది
ముదిత మందహాసం మురిపిస్తుంది
నెలత నవ్వు నలతను తొలగిస్తుంది
భార్య నవ్వు బంధీని చేస్తుంది

అమ్మ నవ్వు, భాగ్యాన్ని ఇస్తుంది
నాన్న నవ్వు, ఎదను మీటుతుంది
అధికారి నవ్వు, అందలాన్ని ఎక్కిస్తుంది
నవ్వు నీ అందాన్నే రెట్టింపు చేస్తుంది

నవ్వుల ఘనత జగమెరిగెను ఏనాడో
చట్ట సభలలో విదూషకులుండిరి ఆనాడే
నేడు చతురత కరువై మానవుడు
లాఫింగ్ క్లబ్బులనే తెరిచేసాడు

నవ్వలేమా కాసేపు రోజులో
పోయేదేముంది మనకందులో
తేడా ఉందా ఏమైనా ఖర్చులో
నవ్వును చేర్చుకో దిన చర్యలో

హాస్యబ్రహ్మ చెప్పిన అద్భుత సత్యం
నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒక భోగం
నవ్వకపోవడం ఒక రోగం
నవ్వక పోతే బ్రతుకే ఆగం
నవ్వు పెంచు ఆయుర్దాయం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!