నవ్వితే ‘నవ్’ రత్నాలు

నవ్వితే ‘నవ్’ రత్నాలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

నవ్వుకు తొలిమెట్టు హాస్యం
నవ్వించడమే దాని రహస్యం
హాస్యాన్ని పండించడమే అసలైన భాష్యం
ఇది అందరికీ తెలిసిన జోస్యం

నవ్వితే యోగం
నవ్వించడం భోగం
నవ్వలేకపోవడం రోగం
నవ్వడమే జీవితంలో ఒక భాగం

పువ్వులాంటి జీవితానికి కావాలి నువ్వు
నవ్వులేని జీవితం సువాసనలేని పువ్వు
పువ్వులు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి
నవ్వులు ఆనంద పరిమళాలు విరజిమ్మిస్తాయి

హాస్యం ఆరోగ్యాన్నిస్తుంది
హాస్యం ఆనందాన్నిస్తుంది
హాస్యం అనుబంధాలను కలుపుతుంది
హాస్యం సంబంధాలను పెంచుతుంది

హాస్యం కాకూడదు అపహాస్యం
హాస్యం హద్దు మీరితే అపహాస్యం
ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని తగ్గించేది అపహాస్యం
అవమానాలు మిగిలిస్తుంది అపహాస్యం
ఆనందాలు మిగులుస్తుంది హాస్యం

హాస్యాన్ని నవ్వులతో ఆస్వాదించడమే హాస్యం
హాస్యాన్ని అందించినపుడు నవ్వులు పువ్వులు విరజల్లులే
స్వచ్ఛమైన నవ్వును ఇచ్చేదే హాస్యం

నవ్వు నాలుగు విధాల చేటు నాటి మాట
నవ్వు నలభై విధాల ఆరోగ్యం నేటి మాట
అందుకే నవరసాలలో ఒకటి హాస్యం
అందుకే నవ్వండి నవ్వించండి
నవ్వితే ‘నవ్’ రత్నాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!