నా అక్షరాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
పేరు: శిరీష వూటూరి
నా అక్షరాలు
మబ్బులు చీల్చుకొని ఉదయించిన
ప్రభాత సూర్యకిరణాలు..
నా అక్షరాలు
మలయ మారుతం వలె చల్లగా
మెల్లగా వీచే పిల్లగాలులు..
నా అక్షరాలు
నా ప్రయాణాన్ని మార్చి ఆత్మ
సంతృప్తినిచ్చిన కవితాకుసుమాలు..
నా అక్షరాలు
నన్ను మళ్లీ అమ్మను చేసిన
అల్లరి పసికూనలు..
నా అక్షరాలు
వర్షపు నీటిలో ఆడుకునే చిన్న
పిల్లల భావాలు..
నా అక్షరాలు
ఏడువారాల నగల కంటే విలువైన
అచ్చతెలుగు ఆభరణాలు..
నా అక్షరాలు
చందమామకు వంతెన వేసి వెలుగును
మోసుకొచ్చే వెన్నెలతీరాలు.