ఇంక సెలవు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
ఇన్నాళ్ళ అనుబంధం ఒక్కసారిగా తెగితే
కొన్నాళ్ళ బాంధవ్యం ఒక్కసారిగా కనుమరుగైతే
ఎనాటికి వీడనిసంబంధం వీడిపోతే
ఈనాడు పలికేనా వీడ్కోలు
సాగినంతకాలం సాగదీసినా
మోజుతీరిందని వదిలేసినా
పడిలేచిన కెరటంలా
పరుగులుతీసిన అలలాంటిది జీవితం
అడుగడుగునా ఎదురయ్యెనా వీడ్కోలు
ఎప్పటికప్పుడు ఒంటరితనమే
ఒకరిని ఒకరు విడవక తప్పదేమోగా
తుదిశ్వాస విడిచేవరకు
చివరిమజిలిచేరేవరకు
ఈ జీవనయానానికి వీడ్కోలేగా
చాలు చాలు ఈ క్షణకాలపు జ్ఞాపకాలు
చాలు చాలు ఈ అస్తిరబాంధవ్యాలు
చాలు చాలు మన ఈ సంపర్కాలు
ఇంక సెలవంటూ వీడ్కోలు పలుకుదాం!