అంశం: హాస్య కవిత
క(ల)దన రంగం..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : ఎస్.ఎల్. రాజేష్
శత్రు సైన్యం చుట్టు ముట్టింది
వార్తాహరుడు కబురు చెప్పాడు.
సుందరీ మణుల నాట్యం చూస్తూ
పరవశిస్తూ ఉన్నా నేను.
హఠాత్తుగా హడలెత్తి పోయా.
వెంటనే గుర్రమెక్కేసా.
కదన రంగంలో దూకేసా.
చక చక కరవాలం తిప్పేసా.
కట కటా పళ్ళు కొరికేసా.
ఫట ఫటా తలలు లేపేశా.
హఠాత్తుగా వెన్నుపోటు పొడిచారు
గుర్రం పై నించి తోసేశారు.
కళ్ళు తెరిచి చూసాను.
మా ఆవిడను చూసి అదిరిపడ్డాను.
ఇంతకీ నేను కల కన్నాను.
మంచం పై నుండి కింద పడ్డాను.