న్యూస్ పేపర్ మనోగతం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మోపిదేవి గౌతమి
నాకోసం ఎదురు చూస్తూ నీవు ప్రతి ఉదయం
నా రాకతో నీ మనసున కలిగేను ఆహ్లాదం
నీ చేతిలో నేను రెపరెపలాడుతూ ప్రతినిత్యం
నన్ను నీవు పట్టుకున్న తర్వాతనే నీ ప్రతికృత్యం
నేనంటే నీకెందుకు అంత ఇష్టం
నేను నీకు మంచి అలవాటునన..
నేను నీకు మంచి స్నేహితుడనన
నేను నీకు అన్నీ తెలుపుతున్నాననా
నీ సమాధానం అన్నిటికీ అవుననేనా
నీవెందుకు నన్ను మరిచావు ఇప్పుడు మరి
నీ కళ్ళకు ఏ మాయలాడీలు
కనబడ్డాయో నాకు తెలుసు
నీ ఇంటికే వచ్చింది అనుకున్నాను గాని
నీ చేతిలోనే చేరి నిన్ను మురిపిస్తుందనుకోలేదు
నీ వెన్నాళ్లు ఉంటావులే ఆ వగలాడి మాయలో
నీకు తొందరగా కళ్ళజోడు పడుతుంది గుర్తుంచుకో
నీకు తలనొప్పి కాయం దాంతోనే కాసేపు ఉంటే
నేను నిన్ను ఉదయం మాత్రమే
నా జతగా ఉంచుకునే దాన్ని
నీ వయ్యారాల రంగుల వగలాడులు మాత్రం
నిన్నంటి పెట్టుకొని నీ కుటుంబం నుండి నీవు గడిపే క్షణాలను దూరం చేస్తున్నాయి
నేను నీకు గొప్ప అని తెలుసుకునే రోజులు తొందరగానే వస్తాయిలే..
నేను నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటున్నాను
నీవు నాకోసం వస్తావని నీ రైలు ప్రయాణంలో
నేనే నీ తోడును గుర్తుంచుకో మరి..