(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)
సౌందర్య లోకం
రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)
కోరికల గుర్రాలెక్కి
లోకయాత్రకి బయలుదేరగ….
పారిజాతం పక్కున నవ్వింది
ఐరావతం రెక్కల గుర్రమై
సౌందర్యలోకాన దింపింది
అదో మణి మాణిక్య శోభితమైన
మయూర లతల కలాపాల నిలయం..
ఆ లోకాన….
ఉప్పొంగని ఉల్లాసాన ఊగని మనసుండదు
మబ్బుల ఈత కొలనులో స్నానమాడుతూ
ఆకాశ అందాల అచ్చెరువు చందాలు తిలకించి
మది పులకరిస్తూ కనులు తెరవగా
చిల్లులు పడ్డ మా రేకుల కొంప దర్శన మిచ్చింది
ఏం చేద్దాం..ప్రాప్తం ఉండాలిగా..