(అంశం : నా అల్లరి నేస్తం) నా ప్రాణాలు
రచన :: మంగు కృష్ణకుమారి
మావిడి చెట్టు మీదనించీ
కూసే కోకిలా, తుర్రుమంటూ ఎగిరే
జంట పిచికలూ నాకు ఇష్టమయిన నేస్తాలు!
జామ చెట్టు మీంచి తొంగి
చూసే రామచిలుకా, శ్రీరాముడి దూతలా మూడు నామాల ఉడతా
నా పంచ ప్రాణాలు!
కత్తెర పిట్టలూ, పావురాలు, బంగారు
పిచుకలూ, అబ్బో, అన్నీ మరచి చూస్తూ ఉంటాను!
నాకు శుభొదయం చెప్పే నేస్తాలే ఈ పక్షులన్నీ!