నాన్న! నన్ను క్షమించవా!
రచన:ఎన్.ధనలక్ష్మి

జారా ఎక్కడ నుంచి వాసన వస్తుంది…పనిమనిషి సరిగ్గా క్లీన్ చేసిందా…లేదా?????
హా విక్కి తను మొత్తం నీట్ గా క్లీన్ చేసింది…
మరి ఇంత భయకరమైన వాసన ఎక్కడి నుండి వస్తుంది.కడుపు తిప్పుతోంది ..
ఒక్క సారి నేను బయటకు వెళ్లి చూసి వస్తా…విక్కి తన అపార్ట్మెంట్ నుండి బయటకి వచ్చాడు కానీ ఆశ్చర్యంగా ఆ బ్లాక్ లో ఉండే అందరు బయటకు ఉన్నారు
అందరు డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎక్కడ నుంచి ఈ వాసన అని?????
ఇంతలో సురేష్ అనే అతనికి డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు…
ఎందుకు వచ్చింది నీకు అనుమానం మన రావు గారి ఇంట్లో నుండి వాసన వస్తుంది అని..
లేదు విక్కి…రావు గారి ఒక్క రోజు కూడా ఆఫీసు కి సెలవు పెట్టడు..ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంటి నుండే పని చేస్తారు… ఐదు రోజుల నుంచి ఆఫీస్ కి రావడం లేదు..ఇల్లు చూస్తే తాళం వేసి ఉంది..ఫోన్ చేస్తుంటే తీయడం లేదు
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఏమో…
నేను ఉదయం వరకు అలాగే అనుకున్న…
మార్నింగ్ ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ నిలపడ్డ బై మిస్టేక్ పడి పోతు రావు గారి తలుపును పట్టుకొన్న ..
తరువాత నా చేతిని తీసివేసి దగ్గు వస్తె చేయి అడ్డుపెట్ట రక్తం వాసన వచ్చింది…అప్పుడే రావు గారి ఇంటి నుండి వాసన వచ్చింది. నాకు ఒక్కరికే అలా అనిపిస్తుంది ఏమో అని డౌట్ వచ్చి వెళ్ళిపోయాను..
ఇప్పుడు అందరికీ వస్తుంది వాసన. మనం తీయకూడదు తలుపు అందుకే పోలీస్ వాళ్లను పిలిపించా…
మంచి పని చేశారు…
ఇంతలో అపార్ట్మెంట్ లో ఉండేవాళ్లు అంతా రావు గారి ఇంటి దగ్గర చేరి గుసగుసలు మొదలుపెట్టారు..
వీళ్లు ఇలా మాటల్లో ఉండగానే విఠల్ అపార్ట్మెంట్ లోకి పోలీసులు వచ్చారు..విషయం తెలుసుకొని రావు గారి ఇంటి తలుపును తెరిచి చూశారు…
విపరీతమైన వాసన వస్తూ ఉంది .. ముక్కుకు మాస్క్ కట్టుకొని రూమ్ లు అన్నీ చూస్తూ వస్తున్నారు..ఒక రూం తాళం వేసి ఉండడం చూసి పగలకొట్టరు ..
లోపల ఉన్నది చూసి అందరూ ఆశ్చర్యపోయారు..
బెడ్ పై రెండు సగం కాలిన శవాలు ఉన్నాయి..రావు గారు మరియు వాళ్ళ వైఫ్ సరళ గారిది
అపార్ట్మెంట్ వాళ్లంతా వాటిని చూసి షాక్ అవ్వడం జరిగింది ,..అసలు ఎలా జరిగింది ??? మనకు ఏమి తెలియలేదు ..ఎప్పుడు అందరిని నవ్వుతూ మాట్లాడుతూ ,ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు అపార్ట్మెంట్ లో ఎవరికి కష్టం వచ్చిన సాయం చేసే మనుషులు ఇప్పుడు ఇలా జీవచ్ఛవం లా పడి ఉండడం చూసి కన్నీరు మున్నీరు అయ్యారు ..
ఆ రెండు శరీరాలను పోస్టుమార్టంకి పంపడం జరిగింది..పోలీస్ వాళ్ళు ఇల్లు మొత్తం సోదా చేసారు , వారికీ ఏమి ఆధారాలు దొరకలేదు ..
ఫోరెన్సిక్ వాళ్ళను పిలిపించి ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసారు ..లోపల రెండు శవాలు ఉన్నాయి ..మరి వాళ్ళ అమ్మాయీ ఏమి అయింది ??? ఏమో సర్ ..తెలియడం లేదు ..
వాళ్లను ఆఖరి సారిగా ఎప్పుడు చూసారు …
ఐదు రోజుల క్రితం సర్ …ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే రావు గారు ఆ రోజు ఎందుకో డల్ గాగ కనిపించరు ..
నేను మాట్లాడి అడిగాను ??? ఎందుకు ఆలా ఉన్నారు అని ఏమి లేదు అండి అని మాట దాటేసి వెళ్లిపోయారు ..
ఇంతలో న్యూస్ తెలిసి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్
ఆఫీసర్ సూర్య అక్కడికి వచ్చారు …వివరాలను అడిగారు …అందరిని అడిగి వివరాలను కనుకొన్నారు /??/
మీరు ఏమైనా అరుపులు ,కేకలు విన్నారా …
లేదు సర్…
అయితే క్రిమినల్ వాళ్ళకి మత్తు మందు లేదో ఇంకా ఏదైనా రూట్ వాడి వారిని అరవకుండా చేశారు ఏమో.
చూద్దాము పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేదాకా మనం ఒక అంచనాకు రాలేము
ఓ సాధారణ క్లర్క్ ..పైగా మృదు స్వభావి . అయినా రావు గారి దంపతులను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది ..వాళ్ళమ్మాయి కరుణ ఏమి అయింది …
ఇల్లు మొత్తం ఇంకోసారి వెతికారు సూర్య ..రావు గారి బెడ్ కింద ఏదో డైరీ కనపడింది …
తీసి చదవడం మొదలు పెట్టాడు …..
” డైరీ రాసే అలవాటు నాకు అసలు లేదు ..కరుణ మా జీవితాల్లో వచ్చేఅంతవరకు …
తనతో గడిపిన ప్రతి సందర్భం నేను గుర్తు పెట్టుకోవాలి అని ..వయసు రీత్యా మర్చిపోతాను ఏమో అని భయం వేసింది ..అందుకే రాసాను
నన్ను గుండెలపై తన చిట్టి పాదాలతో తంతు ఉంటే ఎంత ఎంతసంబరంగా ఉండేది..
కరుణ నన్ను మొట్టమొదటిసారిగా నాన్న అని పిలిచినా రోజు ఎంతో సంబరపడ్డ …
ఈ రోజు కరుణ వాళ్ళమ్మతో గొడవపడుతూ నేను నాన్న కూతురిని అన్నప్పుడు ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ వచ్చింది . తనని ఎత్తుకొని గాలిలో గిరా గిరా తిప్పా …
సరళ కూడా పాపా ఇబ్బంది పడకూడదు అని భావించి తన జాబ్ సైతం వదిలిపెట్టి ఇంటిలో ఉండి అన్నీ చూసుకోసాగింది…
కరుణ అన్నీ విషయాల్లో ముందే ఉండేది… చదువులో కావచ్చు,ఆటలలో కావచ్చు అన్నిటిలో ..
తను సాధించే విజయాలు చూసి మేమిద్దరం గర్వంతో పొంగిపోయివాళ్ళము…
ఈ రోజు టెన్త్ రిజల్ట్స్ వచ్చాయీ…నా బంగారు తల్లి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది ..పత్రికలలో తన పేరును చూసి మా వీధి మొత్తం స్వీట్స్ పంచాము…నా బిడ్డకు ఎవరి దిష్టి తగలకూడదు అని భావించి వాళ్ళమ్మ దిష్టి కూడా తీసింది.. తరువాత తనని ఇంటర్లో జాయిన్ చేశాము.ఇంటర్లో అయితే స్టేట్ లెవెల్లో రాంక్ తెచ్చుకుంది నా బిడ్డ…డిగ్రీ కాలేజ్ లో జాయిన్ చేశాము..
అప్పటినుంచి కరుణ ప్రవర్తించే తీరు చాలా వరకు మారింది…ప్రతిదీ మాకు షేర్ చేసే తను… మా నుంచి
అన్నింటినీ దాయడం మొదలు పెట్టింది..కొద్దికొద్దిగా మా నుంచి దూరం అవ్వడం మొదలు అయింది.
ఓ రోజు కరుణ కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి …
తను కాలేజీకి సరిగ్గా రావడం లేదు అని.. చదువుమీద శ్రద్ధ తగ్గింది అని చెప్పారు…
నేను చాలా బాధ పడ్డాను…అంతవరకు నా బిడ్డ గురించి పొగిడింది విన్న నేను మొట్టమొదటి సారిగా ఇలా వినడం జీర్ణించుకోలేక పోయాను…రేపు ఎలాగ అయినా కరుణతో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి..????
తరువాత అన్నీ పేజీలు కాలిగా ఉన్నాయి ..
డైరీలో అంతవరకే ఉంది….
అది చదవినా సూర్య…. కరుణ ఖచ్చితంగా ప్రేమలో ఉంది… దాని వల్లే వీళ్లను చంపి ఉంటుందా???
చూడండి రావు గారి ఇంట్లో పని చేసేవారు ఇక్కడ ఉన్నారా??? అని అడిగారు మనుషులు ఉద్దేశించి ..
సారు నేనే అయ్య గారి ఇంట్లో పని చేస్తాను…నా పేరు
యాదమ్మ అండి?????
చూడు యాదమ్మ…కరుణ ఎలాంటి అమ్మాయీ…
అయ్య చిన్న అమ్మగారు చాలా మంచివారండి…
కాలేజ్ లో చేరిన తరువాత అమ్మాయి గారు మారిపోయారు.. చీటికీ మాటికీ అమ్మానాన్నల మీద
విసుక్కునేవారు..
కారణం ఏమై ఉంటుంది యాదమ్మ ?నీకేమైనా తెలుసా?
తెలీదు సారు…
ఎవరైనా రావు గారిని కానీ,సరళ గారిని కలవడానికి వచ్చారా???
అవును సారు అమ్మాయి గారు ఒక అబ్బాయిని వెంటబెట్టుకుని వచ్చారు .. అబ్బాయి రాగానే పెద్దమ్మ గారు నన్ను ఇంటికి వెళ్ళిపో మన్నారు..
అబ్బాయీ ఎలా ఉంటాడో మీకు గుర్తుందా??
హా సారు గుర్తుంది.. అబ్బాయి అంతకు మునుపు
కరుణ అమ్మాయి గారి తో చాలాసార్లు చూశా… అమ్మాయీగారు కాలేజేకి అని చెప్పి
అబ్బాయి గారి తో బైక్ లో ఎక్కడికో వెళ్ళే వారు ..
అమ్మ గారితో చెప్పాను. …. నా మాటలు తోసపుచ్చారు…..పెడచెవిన పెట్టేవారు..
యాదమ్మ స్టేట్మెంట్ తో కరుణపై అనుమానం బలపడింది…యాదమ్మ సహాయంతో పోలీసు వారు అనుమానిత వ్యక్తి చిత్రాన్ని వేపించి అన్నీ పత్రికల్లో, అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు….
పోస్టుమార్టం ప్రకారం మొదట రావు గారి దంపుతులకి నిద్ర మాత్రలు ఇచ్చి ఆ తరువాత కత్తితో పొడిచి ,యాసిడ్ వేసి తగలబెట్టారు అని తేలింది .
కరుణ చదువుతున్న కాలేజ్ కి వెళ్లి అందరినీ,కరుణ
ఫ్రెండ్స్ ని విచారించారు.. విచారణలో తేలిందేమిటంతే కరుణ కాలేజీలో ఎవరిని ఇష్టపడటం లేదు అని…
ప్రేమించిన అబ్బాయి ఎవరై ఉంటారు……..
పత్రికలలో, టీవీలలో రావు గారి దంపతులకు న్యాయం జరగలేదని పోలీసులు తీరు గురించి చర్చలు పెట్టుకొని మరి వాళ్ళ పని తీరుని ప్రశ్నిస్తున్నారు …. పోలీసులపై ఒత్తిడి పెరగసాగింది
రోజు రోజుకీ
పోలీసులు అన్నీ చోట్ల గాలిస్తున్నారు…అన్నీ పోలీస్ స్టేషన్ లకి కరుణ,ఆ అబ్బాయీ గీసిన ముఖచిత్రం ఫోటోలను పంపించారు.. హత్యలు జరిగిన ఒక నెల తర్వాత
ఓ లేడీ కానిస్టేబుల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు
కరుణ పోలికలు గల అమ్మయీని చూసింది..కన్ఫర్మ్ చేసుకుందాము అని తనకు తెలియకుండా ఫాల్లో చేసింది..తను ఉన్న అవతారాన్ని చూసి పెళ్లి అయింది అని తెలుస్తుంది. ఫాల్లో చేసి ఆచూకీ తెలుసుకుంది..
కరుణ వెళ్ళిన కొద్ది సమయానికి ఆ అబ్బాయీ కూడా కంగారు కంగారుగా రావడం గమనించింది..
ఫోటోలు చూసి కన్ఫర్మ్ చేసుకుంది. మారు వేషాలతో
ఉన్నారని ఫోటోలు తీసి తన పై ఆఫీసర్ లకు
సమాచారం అందించింది..
పోలీసులు ఆగమేఘలపై వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు..
” చెప్పు కరుణ ఎందుకు మీ అమ్మానాన్నలను ఎందుకు చంపావు..చెప్పలేదు అనుకో మా పద్ధతిలో
చెప్పించవలసి ఉంటుంది..అని సూర్య సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు .
” అమ్మ ,నాన్న..చదువు ఇదే నా ప్రపంచం అని మురిసిపోయే నాకు నిజమైన ఆనందం ఏంటో
వంశీ నా లైఫ్ లోకి వచ్చిన తరువాత తెలిసింది..
ఫ్రెండ్ బర్త్‌డేకి వెళ్ళిన రోజు నాకు పరిచయం అయ్యారు వంశీ..తన మాట తీరు చాలా నచ్చింది..
నన్ను,నా అందాన్ని పొగిడాడు..ఫోన్ నంబర్స్ తీసుకొన్న..
ఆ రోజు నుంచి నా జీవితంలో సంతోషం రావడం మొదలు అయింది..తనతో సినిమాలకి, పార్క్ లకి వెళ్లేదానిని..నన్ను చాలా ప్రేమగా మాట్లాడేవారు..
నాకిష్టమని రోజు గులాబీలను , చాక్లెట్లను ఇచ్చేవాడు
నాకు గోల్డ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు..వంశీ ప్రేమ నాకు చాలా గొప్పగా అనిపించింది అమ్మ,నాన్నల ప్రేమ కంటే…వాళ్ళతో ఏది దాచని నేను వంశీ గురించి చెప్పలేదు…నా ఫ్రెండ్స్ తో కూడా చెప్పలేదు..వంశీ కి
ఇష్టం లేదు మా గురించి అందరికీ తెలియడం…
వంశీ ,నన్ను ఎవరు విడదీయలేని అంతగా తనకి చాలా చాలా దగ్గర అయ్యాను..
నా ప్రవర్తనలలో మార్పు రావడం గమనించిన
నాన్న ఒక రోజు నన్ను గట్టిగా నిలదీయడంతో వంశి గురించి చెప్పా..
నాన్న ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అమ్మ … నీ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టు మంచి జాబ్ తెచ్చుకో అప్పుడు నేనే చేస్తా పెళ్లి ఇలా సోది మాటలన్నీ చెప్పారు.. నాకు నచ్చలేదు ఎదురు తిరిగాను..
వంశీకి జరిగింది చెప్పాను…
వంశీ నాన్న ని కలవడానికి ఇంటికి వచ్చాడు..
తను నాన్నతో చెప్పాడు కూడా కరుణని నాకు ఇచ్చి పెళ్లి చేయమని,బాగా చూసుకుంటా అని ..
నాన్న..బాబు నువ్వు ఏమీ చేస్తున్నావు అని అడిగారు..
వంశీ డిగ్రీ కంప్లీట్ అయింది అని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు..
చూడు వంశీ.. మీ ప్రేమ నాకు అర్థం అయింది..
మొదట నువ్వు జాబ్ తెచ్చుకో,కరుణ కూడా డిగ్రీ పూర్తి చేస్తుంది.తను జాబ్ తెచ్చుకొని సొంతకాళ్లపై
నిలపడ్డ క్షణం , అప్పటికి మీ మధ్య ఈ ప్రేమ ఇలాగే ఉంటే నేను తప్పకుండా పెళ్లి చేస్తాను…అంతవరకు మీరు కలుసుకొకుండా దూరంగా ఉండడి… మీ భవిష్యత్ పై ఇద్దరు ఫోకస్ పెడతారు..
అంకుల్ మీరు చెప్పినవన్నీ జరగాలంటే ఇంకా చాలా
టైమ్ పడుతుంది..అంతవరకు కరుణని విడిచిపెట్టి ఉండలేను మాకు పెళ్లి చేయండి..
బాబు పెళ్లి చేస్తే తనని ఎలా చూసుకుంటావు..
అంకుల్.మా నాన్నగారికి వచ్చే పెన్షన్ అమౌంట్ నాకు ఇస్తారు..వాటితో మహారాణిలా చూసుకుంటా…
మీకు తెలుసా సర్..వంశీ అంతా నిజాయితీగా చెప్పిన కూడా మా నాన్న ఒప్పుకోలేదు సరి కదా గొడవకు దిగారు .పైగా నా వంశీని కొట్టారు… ఇంటి నుండి గెంటివేశారు
మా నాన్నతో గొడవ పడ్డాను…
ఆ రోజు రాత్రి వంశీ ఫోన్ చేసి ” కరుణ మీ నాన్న వైఖరి చూస్తూంటే మన ప్రేమను ఎప్పటికీ ఒప్పుకోరు అని అర్థం అవుతుంది..నీకు నేను కావాలి అంటే ఓ పని చేయాలి…నువ్వు వారి మాట వింటునట్టు నటించు..
మీ ఇంట్లో నిద్ర పోయి ముందు పాలు తాగే అలవాటు ఉంది కాబట్టి వాటిలో నిద్ర మాత్రలు కలిపి ఇవ్వు నువ్వు..మిగిలింది నేను వచ్చాక చూసుకుందాం…
వంశీ చెప్పినట్టు…అమ్మ నాన్నల ముందర నటించి పాలు ఇచ్చాను.నాన్న చాలా సంతోషించారు..
వాళ్ళు పూర్తిగా నిద్ర మత్తులోకి వెళ్ళిన తరువాత వంశీ కి ఫోన్ చేశాను..తను వచ్చి ఇంట్లో ఉన్న బంగారం ,డబ్బుని తీసుకొని బాగ్ లో భద్ర పరచాడు..
నేను కూడా తను రాక మునుపే నా లగేజి మొత్తం సర్దుకున్నా …
పారిపోవాలి అనుకున్నవారు పారిపోక ఎందుకు మీ అమ్మ నాన్న ని చంపారు..
కరుణ వంశి వైపు చూడడంతో సూర్య లాగి పెట్టీ ఒక్కటీ ఇచ్చాడు వంశీని
కరుణ భయపడుతూ జరిగింది చెప్పింది…
పారిపోవాలి అనుకున్న కానీ..వంశీకి ఓ అనుమానం వచ్చింది..
అమ్మ నాన్న కి మెలకువ వచ్చి వాళ్ళ మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడున్న పట్టుకొని మమ్మల్ని విడదీస్తారు… అందుకే వాళ్ళను నేను చంపేస్తాను అన్నాడు.. నాకు కూడా అది నిజమే అనిపించింది..
తన వెంట తెచ్చుకున్న కత్తితో అమ్మ నాన్న పొడిచాడు.. చచ్చిపోతారో లేదొ అనుమానం వచ్చి
వెంట తెచ్చుకున్న యాసిడ్ కూడా వాళ్ళ పై పోసి
అక్కడ నుంచి పారిపోయి వచ్చేశాం.. గుర్తు పట్టకూడదని మారు వేషాలు వేసుకొని చాలా ఊర్లు తిరిగాం…
ఈ ఆదివారం పెళ్ళి చేసుకోవాలనుకున్నo ఇంతలో మీరు మమ్మల్ని పట్టుకున్నారు…”
లేడీ కానిస్టేబుల్ వచ్చి కరుణను లాగిపెట్టి గట్టిగ ఒక్కటీ ఇచ్చింది…
సూర్య ” నీకు మీ అమ్మానాన్నల చంపుతుంటే బాధ అనిపించలేదా కరుణ”
సర్ నాకు మా అమ్మ నాన్న కన్నా వంశీ తో నా జీవితం ముఖ్యం…
సూర్య నవ్వుతూ ” నువ్వు అసలు ఎలా స్టేట్ ఫస్ట్ వచ్చావో అర్థం కావడం లేదు.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటే అది తప్పుకాదు,నేరం కాదు నీకున్నా హక్కు ప్రకారంగా.. వాళ్ళని చంపి పారిపోతే నువ్వు క్రిమినల్ అవుతావ్ అన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు…
మీ అమ్మ నాన్న లు ఎందుకు బంధువులతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారు తెలుసా నీకు కరుణ…….
ఎందుకంటే నువ్వు వారి బిడ్డవి కావు . నిన్ను ఎవరో చెత్తకుప్పలో వేస్తే రావు గారు ఇంటికి తెచ్చుకొని నిన్ను సొంత బిడ్డల్లా చూసుకున్నారు.. వారి కుటుంబ సభ్యులు మొత్తం నిన్ను ఒప్పుకోకపోతే వారి నుంచి బయటకు వచ్చేసి వారితో పూర్తిగా సంబంధాలను తెంచుకొన్నారు..
నువ్వు అనాధగా అని నీకు కూడా తెలియకుండా అంత గొప్పగా పెంచారు.. నీ కోసం వారి పిల్లలను కనడం కూడా మానేశారు.. ఎందుకో తెలుసా వాళ్లు పుడితే నీ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందొ అని భావించి.. రావు గారి తమ్ముడు వచ్చి చెప్పేంత వరకూ మాకు తెలియ లేదు నువ్వు ఒక అనాధవని..
మీ నాన్న ప్రాణ స్నేహితులు కూడా తెలియదు వాళ్ళు కూడా నువ్వు సొంత బిడ్డ అనుకున్నారు..అంత గొప్ప వ్యక్తులకు నువ్వు ఇచ్చిన బహుమానం వాళ్ళకి
తెలియకుండా వాళ్ళను చంపడం..
మీ అమ్మ తనకెంతో ఇష్టమైన ప్రొఫెషన్ ని వదిలి పెట్టింది ఎందుకో తెలుసా నిన్ను బాగా చూసుకోవాలని.. మీ నాన్న అయితే పార్ట్ టైం జాబ్ చేసేవారు నీ కోరికలన్నీ తీర్చాలని.. అంత గొప్పగా ప్రేమించిన మీ నాన్న ప్రేమ నీకు కనపడలేదు కానీ ఒక మూడు నెలల పరిచయం గొప్పగా అనిపించిందా… రావు గారి దంపతులకు తెలియదు లేదు వాళ్ళు ఒక పాముకు పాలు పోసి పెంచుతున్నామని… తిరిగి వాళ్ళకి కాటు వేస్తుందని….
నువ్వు చేసింది నేరం కాదు పాపం కరుణ పాపం… పెద్ద శిక్ష అనుభవించక తప్పదు..
కరుణ గుండెలు పగిలేలా ఏడ్చింది అమ్మ నాన్న నన్ను క్షమించండి అని….
ఇప్పుడు కరుణ మూడు నెలల గర్భవతి…. వంశీతో పాటు జైల్ శిక్ష అనుభవిస్తోంది…
ప్రతిరోజు నాన్న నన్ను క్షమించమని ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంది కరుణ…. జైలు గోడల మధ్య ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తోంది….
***
