(అంశం:”అగమ్యగోచరం”)
గుండె దడ
రచన ::జీ వీ నాయుడు
ఏమో ఏమో ఏమేమో
అంతా అగమ్యగోచరం
పేరుకు ప్రజా స్వామ్యం
ప్రశ్నిస్తే అంతా నరకం
కక్షలు కార్పణ్యాల మిళితం
ప్రశాంతతకు విఘాతం
మాస్క్ అడగడమే వైద్యుని పాపం
అదే అతనికి మరణ శాపం
నీతీ నిజాయితీ లకు పాతర
అవినీతి ఆరాచకాలకు జాతర
ఆడబిడ్డల ఆక్రంధనల రోధన
ఆలకించే వారే లేక ఆందోళన
దిశా చట్టం ఉన్నా ఆగని హింసా
ప్రతిపక్షాల గొంతు నొక్కే పాలన
అంతా ఏకపక్ష అదిరింపు బెదిరింపులు
నేరస్తులకే అధికారుల లాలన
అంతా అగమ్యం తెలుగునేల
తలచుకుంటే ఆగదు గుండె దడ.
***