ఎస్పీ బాలు గారి స్మరణ దినోత్సవం

ఎస్పీ బాలు గారి స్మరణ దినోత్సవం

రచన: కవితదాస్యం

“దివికేగిన బాలు -మదిలో మెదిలిన స్మరణలు ” శ్రీ శ్రీ పూజ్య గాన గంధర్వ పిపాసి ఐన బాలుగారు -బాలుగారు -బాలుగారు ఏమని వర్ణించను మీ నామధేయం !అపురూపం -అనంతం -అజరామయం . అందరి పెదాలపై నానుడి వయ్యావే !ప్రతి ఇంటి బాలుడివయ్యావే !ప్రతి మనసును కొల్లగొట్టావే !పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఋజువు చేశావే !మీ గాన గాత్ర మాధుర్యంతో ఖైదు చేశావే !పదాల బాణీతో పరదేశియులను సైతం మెప్పించి ,ఒప్పించావే !దేశ -భాషలని లెక్కచేయక ఎందెందు వెతికిన -అందందు కలనని నిరూపించావే !నీ చూపు విసిరి ప్రతి గాయకుడిని తట్టి లేపి ,ధన్యుణ్ణి చేశావే !పదాల మకరందాన్ని జుర్రుకొని పాటలకే మత్తెక్కిస్తివే !అవకాశంకి వేచి చూడక ప్రయత్న రథంలో పరుగిడితివే !సహజత్వం పుణికి పుచ్చుకున్న సాధారణ మనిషివే !గళం నీదే -గాత్రం నీదే నంటివే !దశ నీవే -దిశ నీవే నంటివే !మాటతో మాయ జాలం చేస్తివే !అక్షరాలకు అభిషేకం చేసి స్వరాలను కూర్చితివే !చిన్నా -పెద్ద తారతమ్యం లేకుండా అందరిలో సరిగమ పలికించావే !ఎన్నో సంగతులు కుర్చావే !సంగీతానికి పెద్ద పీట వేసిఅందరిని భాగస్వాములను చేశావే !అందరిని నీ గాత్రంతో రుణగ్రస్తులనుచేస్తివే !ఎంత ఎత్తు ఎదిగిన నేల బాలుని వలే నీ చూపు విసిరితివే!
చుక్కల్లో చేరిన అందరి మదిలో తార లామెరిసావే
చెరగని ముద్ర లా నిలిచావే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!