మనోవేదన
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
ఏదో చెప్పాలనే తపన మదిలో తొలుస్తోంది
ఏదో గుబులు గుబులుగావుంటోంది
ఏదో చెప్పలేని చెప్పుకోలేని చెప్పరాని భావాలు
సుడులు సుడులుగా మదినిండా తిరుగుతున్నాయి
ఏవరో నన్ను తన దగ్గరకు తీసుకున్నట్టుంటుంది
ఏవరో నన్ను రారమ్మని పిలచినట్టుంటుది
కళ్ళముందరో ఏదో రూపం కదలి కనుమరుగవుతుంటుంది
కళ్ళుమూసుకున్నా ఏదో ముసుగుకప్పుకున్నరూపం
కదలాడుతుంటుంది
ఇంకేదో ఇంకా ఇంకా చెప్పాలనేవుంటుంది
కాని మాటలకందని భావాలేవో ముసురుకున్నట్టుంటుంది
ఏమి చెప్పలేని మనోవేధనే మిగులుతోంది.