లక్ష్మీ కళ
రచన: శిరీష వూటూరి
జలజల పారే
సెలయేరులా
గలగలమని
మాట్లాడుతారు
అతి సున్నితమైన
మనస్తత్వం
అందరూ కావాలనుకునే
తత్వం వారిది
నాన్నకు మరో
అమ్మలా ఆప్యాయత
పంచుతారు
ఇల్లంతా సందడిగా
తిరుగుతూ
లక్ష్మీ కళ తెస్తారు
కూతుళ్లు ఉంటే
ఆ ఇంట్లో సిరుల
పంట పండినట్లే
వాళ్ళు లేకుంటే
ఎన్ని ఉన్నా ఆ
ఇల్లు ఆత్మ
కోల్పోయినట్లే.