ఆడపిల్ల

ఆడపిల్ల

రచన: కవిత దాస్యం

భగవంతుడు బతుకు ఇస్తాడు!
అమ్మబతుకుని కో రుతుంది!
అందరి బతుకు తనదే అని భావించి బతుకుతుంది!
ఇలాంటి తల్లికి, చెల్లికి అక్కకు, వదినకు ఈ సమాజం ఏమిచ్చి రుణం తీరుస్తుంది!
అడుగడుగున ముళ్లపొదల్లో నడుస్తున్నా ని మరచిన అద్భుతాలను సృష్టించింది!
అందరిని అక్కున చేర్చుకుని ఆప్యాయతనే పంచింది!
ఆడపిల్ల ఎదిగి, ఎదగకుండానే మొగ్గలోనే తుంచే అల్లరిమూకలకు ఎప్పుడు నూకలు చెల్లేది!
స్వేచ్ఛ లేకుండా, ఆంక్షలు కట్టుబాట్లు లోబడి,
ఒక మొక్క ఎదగదు, అలాంటిది ఆడపిల్ల ఎదిగి
తనదైన ఉన్నతిని చాటడానికి, స్వాతంత్రపు పోరు జరగాల్సిందే!
ఆడది మగాడి వెనక నేనున్నానే భరోసా,
ఎలా అయితే ఇస్తుందో మగాడు ఆడదాని వెనకుండి,
నేనున్నానని ధైర్యంఇచ్చిన నాడే,
సమాజం ముందడుగు వేస్తుంది!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!