అద్భుతశక్తి

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

అద్భుతశక్తి

రచయిత :: బండారు పుష్పలత

వారియర్ , జూలీ అనే ఇద్దరు మనుషులు, ఎన్నో ఏళ్లుగా వాళ్ళ తాత ముత్తతాల దగ్గర వున్న తాళపత్ర వ్రతులను అందులో వున్న తాంత్రిక మంత్రాలను సిద్దించుకోవడానికి చాలా చీకటిగా వున్నా దట్టమైన అడివికి వెళుతారు అక్కడ కొన్ని సంవత్సరాలు ఆశక్తిని వంట బట్టించుకుంటారు. వారికీ ఒక కూతురు జన్మిస్తుంది అమ్మాయిపేరు రోజి అని పెడుతారు. ఆ అమ్మాయికి చిన్ననాటి నుండి ఆమంత్ర శక్తి నంత ధారపోసి వాళ్ళు చనిపోతారు. రోజి కి చాలా బాదేసి ఒంటరిగా ఉండలేక తాను ఆ అడివిలో నడుచుకుంటూ వచ్చిఒక చెట్టు నీడన సేద తీరుతుంది. అద్భుత తాంత్రిక శక్తి కలిగిన రోజి ని లోరెంజో చూసిఅబ్బా ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఎవరో అని ఆ అమ్మాయి లేచే వరకు అక్కడే వుండి అమాయకత్వాన్ని చూపిస్తాడు. ఆలా కొన్ని రోజులు ఆమెతో ఉండడం వల్ల రోజి ఇతనితో ప్రేమలో పడుతుంది. కాని అతనికి అరా అనే అమ్మాయితో ప్రేమ వ్యహారం ఉందని తనకు తెలియదు. లోరాంజెకు కూడ అతీత మైన తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ రోజిని తనతో తీసుకువెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాడు ఆలా ఇద్దరు కలిసి జీవిస్తుండగా ఒక రోజు తను ఆరాతో అడివికి వెళ్లి ప్రేమ కలాపాలు సాగిస్తున్న తరుణంలో రోజీ అతన్ని వెతుకుంటూ వెళుతుంది. అంతలో రోజి కంట పడతారు ఇద్దరు. అది చూసి భరించలేని రోజి అతన్ని తన మంత్రశక్తితో
శిలగా మారుస్తుంది. అంతలో ఈ అతీత శక్తులున్న వాళ్ళు చనిపోతే అటు స్వర్గానికి, నరకానికి కాకుండా ఒక కొత్తలోకాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే లోరెంజో చనిపోతే తనతో పాటు లోకంలో గడపవచ్చు అని మరి ఆరాని లోరాంజో తో ఎప్పటికి కలవనివ్వకుండా ఆ కొత్త లోకానికి గేటును చేసి ఉంచుతుంది. ఆ గేటును దాటి వెళ్ళాలి లోకం లోకి వెళ్లాలంటే. అంతలో లోరెంజోకి ప్రాణం వస్తుంది. వెంటనే రోజి తన మాయలతో
అతన్నిచంపడానికితానుచనిపోవడానికిప్రయత్నిస్తుంది. ఈ యుద్ధం ఇలా జరుగు తుండగా అనుకోకుండా ఒక జాలి రోజి పై వాలుతుంది. ఎవరా అని చూసేసరికి లోరాంజో గురువు తీరా అనే మాంత్రికుడు అతన్ని చూసి రోజి అడుగుతుంది ఎవరు నువ్వు అని అప్పుడు తీరా చెపుతాడు. నీప్రేమికుడు లోరెంజో నేను సృష్టించిన ఒక మాయ బొమ్మఅని నీకు తెలియదు. నీ దగ్గరవున్న అతీత శక్తులను వశపరుచుకోవడానికి నేనే వాడిని నీదెగ్గరికి పంపాను ఈనాటి కి సరిగ్గా మూడురోజుల్లో నిండు అమావాస్య ఉంది నిన్ను
అనాడు కాళీమాతకు నీరక్తంలోనా రక్తం కలిపి బలి ఇస్తే నీ అతీత శక్తులు నా వశమవుతాయి అని చెప్పి తనని తీరా స్థావరానికి తీసుకెళ్లి తన మాయలతో రోజిని చిత్రవదలు చేస్తాడు అంతలో లోరెంజో కి ఆ రాతికే ప్రాణం పోస్తుంది రోజి. లోరెంజో తిరిగి ఆ రాతిబొమ్మ వేషంలోనే తన గురువుదగ్గరికి వచ్చి రోజి ని బలి ఇవ్వడానికి అన్ని సహాయాలు చేస్తుంటాడు. రోజి ఆసన్నివేశాన్ని చూసి చాలాబాధపడుతుంది. ఇక తెల్లవారితే బలి. కార్యక్రమా నికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు తీరా. ఆరోజు ఆ చిమ్మని చీకట్లో డోర్లన్నీ కదులుతూవుంటే ఒక పెద్ద తుఫానులో ఒక రూపం కదులుతూ రోజి దగ్గరికి వచ్చి నిలుచుని రోజి నీకు నీశక్తి ఎవరైనా గుర్తు చేస్తే కానినీ శక్తి నీకు తెలియదు.నీ శక్తుల ముందు ఆ తీరా ఒక అర్భకుడు వాన్ని చంపి నీ లోకానికి నువ్వు చేరుకో అక్కడ నువ్వే మహారానివి అని చెప్పి వెళ్లి పోతుంది ఆ రూపం. అంతలో తెల్ల వారుతుంది. రోజి అలానే వుంటుంది. అంతలో లోరంజో
రోజిని కాపాడాలని తీరానుఎదిరిస్తాడు వెంటనే తన మంత్రదండంతో లోరెంజో ను మళ్లీ ప్రాణం లేని శిలగా మార్చేస్తాడు. అంతలో రోజిని తీసుకెళ్లి బలిపీఠం లో కూర్చో బెట్టి బలి సమయంలో పూజలు జరిపిస్తాడుతీరా ఇదంతా చేసాక ఒక పెద్ద అవతారం గా రోజి వచ్చి వాన్ని చంపి తినేస్తుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!