నేరం చేసింది ఎవరు??

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

నేరం చేసింది ఎవరు??

రచయిత :: అశ్విని ‘సంకేత్’

బాత్ రూంలో నిండుగా ఉన్న బాత్ టబ్ లో దీప్తి మొఖాన్ని ఎవరో కిందికి గట్టిగా అదుముతున్నారు. తను ఎంత పెనుగులాడినా ఆ అవతల వ్యక్తి పట్టు నుండి తప్పించుకో లేకపోతుంది.అలా పెనుగులాడుతూ ఉంటే తప్పించుకో లేకపోవడం వల్ల కొన్ని క్షణాల్లో తన ఊపిరి ఆగిపోయింది…

ఒక్కసారిగా బెడ్ పై పడుకున్న దీప్తి దిగ్గున లేచి మొఖానికి పట్టిన చెమటను తుడుచుకుని ఇదంతా నా కల.నేను నిజంగా చనిపోయాను అనుకుని బయపడి చచ్చాను అని అనుకుని,

“ఇదేంటి తెల్లారి 8:00 అయినా ఇంకా ఈ పార్వతమ్మ టీ తేలేదు. ఈ పాటికి తేవాలి కదా! అనుకుని” బెడ్ పై నుండి లేచి తన గది నుండి బయటకు వస్తూ ఇంకొన్ని గంటల్లో నన్ను పెళ్ళికూతుర్ని చేయాలి అయినా ఇంకా ఎవ్వరు నన్ను లేపలేదేంటి అనుకుంటూ…

మెల్లిగా మెట్లు దిగి కిందకి వస్తున్న దీప్తికి ఇల్లంతా పెళ్లి ఇల్లు వాతావరణం కాకుండా చావు ఇల్లు వాతావరణం కనపడుతుంటే బయం భయంగా కిందకి దిగేసరికి మెట్ల పక్క వంట గదిలో పనిమనిషి పార్వతమ్మ ఏడుస్తూ కనపడింది.

ఏమైంది దీనికి అని పార్వతి దగ్గరికి వెళ్లి “ఏమైంది పార్వతమ్మ అని దీప్తి అడుగుతున్నా”పార్వతమ్మ సమాధానం ఇవ్వక పోవడంతో…

ఇంకొంచం బయం వేసి ఇంట్లో ఎవరికి అయినా ఏమైనా అయ్యిందా అనే తలంపు మనసులో రాగానే ఒక్క పెట్టునా దీప్తి హాల్ లోకి వచ్చి చూచే సరికి తల్లి,తండ్రి,చెల్లి…ఇంకా దగ్గరి బంధువులు అందరూ ఉండే సరికి అమ్మయ్య! ఎవ్వరికీ ఏం కాలేదు అని ఊపిరి పీల్చుకుని…

ఇంతకీ వీరు ఎందుకు ఇలా హల్ లో గుమి గూడి ఉన్నారు అని తను వాళ్ళను తప్పించుకుంటూ ముందుకు వెళ్ళేసరికి అక్కడ హల్ మధ్యలో ఉన్న దాన్ని చూసి షాక్ అవుతుంది దీప్తి.

షాక్ నుండి తేరుకుని నే…నే….నేను…అక్కడ ఉన్నానెంటి? పైగా తల వరకు తెల్లని గుడ్డ కప్పి ఉంది.కానీ నేను ఇక్కడే ఉన్నా కదా! మరి అక్కడ ఉన్నది ఎవరు? అనుకుంటూ…

పక్కనే ఉన్న వారి మాటలు వింటూ హతాసురాలు అయ్యింది…

పక్కనే ఉన్న వాళ్ళు “పాపం ఇంకొద్ది క్షణాల్లో పెళ్లి కూతురు అవుతుంది అనుకున్న కూతురు చచ్చి శవం అయ్యి ఎదుట ఉండే సరికి ఎలా విలవిలాడి పోతున్నారో రావ్ దంపతులు అనుకుంటున్నారు”.

దీప్తి కి వారి మాటలు చెవికి ఎక్కడం లేదు తన ఆలోచన శవం అన్న మాట దగ్గరే ఆగిపోయింది.

శవమా! నేను శవంగా మారానా?కానీ అది ఎలా సాధ్యం.నన్ను ఎవరు చంపారు? నేను ఎవ్వరికీ ఎప్పుడూ ఏ అన్యాయం చేసి ఎరుగనే?…

అయినా నేను ఇంట్లో కదా ఉన్నాను ఎప్పుడు ఇది జరిగింది అనుకుంటూ నిన్న ఈవెనింగ్ సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది.

“నిన్న సాయిత్రం తను నడుపుతున్న అనాథ ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది అని తన చెల్లి సిరి తెచ్చి ఇచ్చేసరికి అటు వైపు నుండి ‘ మేడం! మన ఆశ్రమంలో కొందరు పిల్లలు కనపడటం లేదు అనడంతో ‘ తన తల్లి, నువ్వు ఒంటరిగా వెళ్ళవద్దు చెల్లిని తీసుకుని వెల్లు అంటున్నా వినిపించుకోకుండా పరుగున కార్ ఎక్కి తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం గుర్తు వచ్చింది.”

తర్వాత ఏమైంది అనుకుంటూ తలను గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూలబడి పోతుంది దీప్తి.

ఇంతలో పక్క నుండి ” పాపం తను బాగానే డ్రైవ్ చేస్తుంది అంట కానీ,వెనుక నుండి ఎవరో కావాలని లారీ తో గుద్ధి పక్కనే ఉన్న చెరువులో పడేటట్టు చేశాడు అంట ఎవరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడని ఇప్పుడే ఇన్స్పెక్టర్ రామ్ అంటున్నాడు” అని అనుకుంటూ ఉంటే…

నన్ను హత్య చేశారా? ఎవరు అయి ఉంటారు? నన్ను హత్య చెయ్యవలసిన అవసరం వాళ్ళకి ఏమి ఉంది?…..అని అనేక ప్రశ్నలు దీప్తి బుర్రను తొలిచేస్తూ ఉంటే…

ఇంతలో తన శవానికి జరగవలసిన క్రియలు అన్నీ తండ్రి దగ్గరుండి చేస్తున్నాడు.

అది చూస్తూ దీప్తి గుండె బరువయ్యింది.తన బాధ చెప్పుకోడానికి కూడా ఎవ్వరూ లేరు తనకి.

గుండెలు అవిసి పోయేలా ఏడుస్తున్నారు తల్లి,తండ్రి,చెల్లి….తనకి కాబోయే భర్త వర్షిత్.

వారిని చూస్తూ ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది దీప్తి ఆత్మ.

దీప్తి అత్యక్రియలు అయిపోయిన వెంటనే,వచ్చిన వారు అందరూ వెళ్లిపోవడంతో ఇల్లు ఇప్పుడు నిజంగానే దీప్తి కి చావు ఇల్లులా భయంకరంగా, నిశ్శబ్ధం గా తోచసాగింది.

ఇంతలో అక్కడికి వచ్చిన వారి ఇంటి ఆచారి ( ఆ కాలనీ గుడి పూజారి)ఇల్లంతా ఒక్కసారి కలియ చూసి,రావ్ దంపతులతో ” మీ అమ్మాయి ఆత్మ శోబిస్తుంది! తనకి శాంతి చేకూర్చాలని అంటే శాంతి చేయాలి అంటాడు”.

వారు ఒప్పుకోవడంతో రేపు వచ్చి శాంతి పూజ చేస్తాను. ఈ లోపు ఈ సామాను తెప్పించింది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

దీప్తి కి అతనికి తన ఉనికి తెలిసింది అంటే అతను తో ఒకసారి మాట్లాడి చూద్దాం అనుకుంటూ అతని ఇంటికి వెళ్తుంది.

ఇంటి పెరడులో దేవీ జపం చేస్తున్న అతను కళ్ళు మూసుకుని ” రా అమ్మా! దీప్తి అంటాడు”.

మీకు నేను కనిపిస్తున్నానా? అంటుంది దీప్తి.

లేదు నువ్వు కనిపించవు నాకు.కానీ, నీ ఉనికి నాకు తెలుస్తుంది.నిత్యం దేవీ పూజలో ఉండే నాకు కొన్ని ఆత్మలు ఉనికి తెలుస్తుంది అంటాడు.

అయితే,మీకు నా ఆత్మ కనిపించినప్పుడు నాకు ఈ గతి పట్టించిన వాడు కూడా తెలిసే ఉంటుంది.తను ఎవరో చెప్పండి అంటుంది.

చెప్పినా ఫలితం లేదు తల్లీ! నీకు దుఃఖం తప్ప ఎందుకంటే నీకు ఈ గతి పట్టించింది నీ వారే,నిన్ను ప్రేమించిన వారే,నీవు ప్రేమించిన నీ వారే అంటాడు.

అంటే నా వాళ్ళు అంటే అంటుంది. అది తెలుసుకుని నీవు చేసేది లేదు.కాబట్టి నేను దేవీ పూజ చేస్తా ఆ పూజలో పాల్గొ నీ లాంటి ముక్తి లేని అత్మలకి అమ్మ ముక్తి కల్గిస్తుంది అంటాడు.

లేదు నా కావాల్సింది ముక్తి కాదు.నన్ను చంపించిన వారి ప్రాణాలకు విముక్తి కలిగించడం అంటుంది ఎర్రగా మారిన కళ్ళతో.

వద్దు తల్లి! నా మాట విను ముక్తి పొందు అంటాడు ఆచారి.

లేదు అని కరాఖండిగా చెప్పిన దీప్తి తో ” అయితే విను, నీ ఆత్మకి ఈ పున్నమి కాక మరు పున్నమి రోజు ముక్తి కల్గ బోతుంది అని అమ్మ ఇప్పుడే నాకు చెప్పింది. ఈ లోగా నీకు అన్యాయం చేసిన వారి గురించి తెలుసో అంటాడు.

సరే,అంటూ దీప్తి ఇంటికి తిరిగి వస్తుంది.ఇంట్లో అందరూ విచారంగా ఉన్నారు.తండ్రి ఏడవటం లేదు గానీ, ఈ లోకంలో లేడు.ఇక తల్లి అయితే చెప్పే అక్కర లేదు.వాళ్ళ ఇద్దరినీ సిరే చూసుకుంటుంది.ఎన్ని రోజులు గడిచినా దీప్తి కి తనని చంపించింది ఎవరో అర్ధం కావటం లేదు చిన్న క్లూ కూడా దొరకటం లేదు.

ఇంతలో ఒక రోజు తన చెల్లి సిరి, తన గదిలోకి వెళ్ళడం చూసి దీప్తి కూడా సిరి వెనుక వెళ్తుంది.

దీప్తి గదిలో ఉన్న సిరి, దీప్తి ఫోటో కాసి చూస్తూ ” పిచ్చిగా నవ్వుతూ…చచ్చావు… నువ్వు చచ్ఛావు… ఈ రోజుతో నీ పీడ నాకు విరుగుడు అయ్యింది లేకపోతే నేను ప్రేమించిన వాడినే నువ్వు పెళ్ళడదాం అనుకుంటావా? అంటూ” గట్టిగా నవ్వుతూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది.

అంటే నన్ను చంపించింది సిరేనా అని అనుకుంటూ, బాధగా ఏడుస్తూ ఇంతలో నే కోపంగా మారి నన్ను చంపిన నిన్ను ఎలా ప్రాణాలతో వదులు తాను అనుకుంటున్నావు నిన్ను చంపి కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళాను అనుకుంటుంది మనసులో దీప్తి ఆత్మ.

ఇంతలో హల్ లో ఏవో మాటలు వినవడుతుంటే అటు వైపు చూసే సరికి అక్కడ వర్శిత్ తల్లి తండ్రులు ఉంటారు ఎంటా అని దీప్తి అక్కడికి వెళ్లే సరికి…

వారు ” చెడు జరిగిన ఇంట్లో మంచి జరిగితే మంచిది అని మా పంతులు గారు అన్నారు! అందుకే మీ రెండో అమ్మాయిని మా వర్షిత కి ఇచ్చి పెల్లిచెద్ధాం.వాడు కూడా దీప్తి పోయినా దగ్గర నుండి బాధలో ఉన్నాడు వాడి బాధను అర్థం చేసుకుని వాడ్ని మామూలు వాడ్ని సిరి చేస్తుంది అని మా నమ్మకం అంటారు.

దీప్తి తల్లి కాదు అంటున్నా తండ్రి సరే అని వారికి మాట ఇస్తాడు కారణం అంత మంచి సంబంధం పోతే మళ్లీ రాదు అని.

ఇదంతా చూస్తున్న దీప్తి వర్శిత తో ఎలాగైనా సిరి విషయం తెలియచేయాలి అని వెళ్ళేసరికి అక్కడ వార్షిత్ ఫ్రెండ్ ఫోన్ లో ఏరా మామ నువ్వు అనుకున్నట్టే సిరి తో నీ పెళ్లి అవుతుంది నువ్వు హ్యాపీ కదా అనే సరికి మారు మాట్లాడక అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి సిరి మళ్లీ దీప్తి గదిలోకి వెళ్ళి ఫోటో ముందు ” నన్ను క్షమించు అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ నా అనుకున్న వాడ్ని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకునే సరికి నిన్ను చంపాలి అనుకున్నంత కోపం వచ్చింది కానీ,నిన్ను చంపే అంత దుర్మార్గురాలిని కాదు అంటుంది.

ఆ మాటలు విన్న దీప్తి సిరి హత్య చేయించలేదని బావించి అయితే వర్శిత్ చేయించాడు ఈ హత్య అతని నిర్వాకం రెండు రోజుల్లో వున్న నిర్చితార్థంలో చూద్దాం అనుకుంటుంది మనసులో.

నిర్చితర్థం రోజు దగ్గరి బంధువుల సమక్షంలో ఉంగరాలు మార్పించే సమయంలో వార్శిత్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను అమ్మా వాళ్ళ బలవంతం వల్ల దీప్తిని పెల్కడదాం అనుకున్నా కానీ తర్వాత తన వ్యక్తిత్వం నచ్చి అనుకోకుండా నే ఆమెని ప్రేమించాను తను లేని లోటు వెరవరు తెర్చలేరు అంటూ వెళ్లబోతుంటే ఇంతలో ఇరు వైపుల వారు నచ్చచెప్పి ఉంగరాలు మార్చు కొమ్మంటే ఇంతలో పోలీస్ ఆఫీసర్ రామ్ వచ్చి

మీ అమ్మాయిని చంపిన వారి ఆచూకీ తెలిసింది అంటాడు.ఎవరు అని ఆవేశంగా అన్న రావ్ గారితో తను మీ ఫైవ్ పద్మావతి అంటాడు.అందరూ నిర్గంతి పోతారు.

రుజువు అన్న ఆవిడతో లారీ డ్రైవర్ ను చూపించి నిజం చెప్పిస్తాడు.

అంతటితో అవును నేనే ఆ ఏక్సిడెంట్ చేయించా,నా కన్న కూతురు కానీ ఆ దీప్తి నా కూతురు ఆనందాన్ని లాక్కుంటుంది అని నేనే చేయించా.సిరి వర్శిత నీ ప్రేమిస్తుంది అందుకే అలా చేయించా అంటుంది.

ఇన్ని రోజులు తల్లి కన్నా ఎక్కువగా చూసిన తన సవతి తల్లి ఇంత చేసింది అని తెలుసుకున్న దీప్తి పెంచిన ప్రేమని చంపలేక పూజారి వద్దకు వెళ్ళిపోతుంది ముక్తి కోసం.

తల్లి చేసిన నేరానికి కూతుర్ని బాధపెట్టడం ఇష్టం లేక సిరితో ఎంగేజ్ మెంట్ చేసుకుంటాడు వర్శిత్త్.

పద్మని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న జీప్ ఏక్సిడెంట్ అయి పద్మ తలకి రాయి తగిలి చనియోధుంది.

దైవం శిక్ష వేసింది పద్మ చేసిన నేరం కి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!