అక్షర విన్యాసాలు(నారద నీరద మహతీ నినాదం)
రచన: మక్కువ. అరుణకుమారి
నా అక్షర మాలికలు కదలనంటున్నా యి
ర సరమ్య రాగాలై
ద రికి రానంటున్నాయి
నీ రాజన నజరానాలు
ర చించనంటున్నాయి
ద ట్టమైన కవితలల్లనంటున్నాయి
మ త్తేభ వృత్తాలు రాయనంటున్నాయి
హ ంసధ్వని రాగాలు మీటనంటున్నాయి
తీ యనైన పాటగా మారనంటున్నాయి
ని శ్శబ్ధ రవాలై
నా ట్యమాడుతున్నాయి
ద ండించుదామంటే
దొరకనంటున్నాయి
***