భారమైన బాల్యం

భారమైన బాల్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎస్.ఎల్.రాజేష్

పేషెంట్ల తో హాస్పిటల్ రద్దీగా ఉంది. రోగులు వచ్చి నాతో వాళ్ల బాధలు చెప్పుకుని మందులు రాయించుకుని వెళ్తున్నారు. వైద్యునిగా నా నిత్యకత్యం ఇది. అంతలో ఒకామె ఓ అమ్మాయిని తీసుకు వచ్చింది. 10 సంవత్సరాలు ఉండొచ్చు ఆ పిల్లకి.  “ఏంటమ్మా సమస్య అని అడిగాను”. వెంటనే వాళ్ళమ్మ ” పాప నాలుగు రోజులు నుండి నడుం నొప్పి అంటుంది డాక్టర్” చెప్పింది. నేను ఆ అమ్మాయి వైపు చూసాను.నడుములో ఉన్న బాధ కళ్ళల్లో కనబడుతుంది. “ఏం చదువుతున్నావు” అడిగాను. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ” తనకి తెలుగు రాదండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుతుంది.” చాలా గొప్పగా చెప్పింది తల్లి. నేను ఇంగ్లీష్ లో అడిగితే చెప్పింది. పలానా ప్రఖ్యాత స్కూల్ లో 6 క్లాస్ చదువుతుంది” అంది వాళ్ళమ్మ. నాకు కొంచెం అనుమానం వచ్చింది. నీ క్లాస్ రూం ఏ ఫ్లోర్ లో ఉంది” అన్నా. “ఫిఫ్త్ ఫ్లోర్ “. ఒక్కసారి నా మనసు చలించింది. పట్టుమని పదహారు కేజీల బరువు కూడా లేని ఆ పిల్ల 40కేజీ ల పుస్తకాల సంచిని మోసుకుని అన్ని అంతస్తులు రోజూ ఎక్కుతుంది అన్న మాట అనుకుని “ఒకసారి స్కానింగ్ తీయిద్దాం” అన్నాను. సరే అని వాళ్ళమ్మ పిల్లకి స్కాన్ చేయించుకుని వచ్చింది. రిపోర్ట్ చూసిన నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంత చిన్న వయసులో వెన్నుముక లో మూడు పూసలు అరిగి పోయాయి. ఆపరేషన్ చేసినా నయం అవుతుందని నమ్మకం చెప్పలేము. డాక్టర్ గా తల్లికి అదే మాట చెప్పాను కానీ మనిషి గా కుమిలిపోయాను. పనికి రాని చదువుల మోజులో పడి పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్న తల్లితండ్రుల పై కోపం తన్నుకు వచ్చింది. నా చిన్నప్పుడు బడికి వెళ్తే రెండు టెక్స్ట్ బుక్స్, ఓ చిత్తు పుస్తకం చిన్న సంచిలో వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బస్తాల్లాంటి సంచుల్ని మోస్తూ కూలీల్లా మారుతున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!