విచిత్ర భావాలు

విచిత్ర భావాలు

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయములో మొక్కల మధ్య పాదులు చేస్తూ నీరు పెట్టిస్తు మొక్కల సంరక్షణ చేయిస్తున్నాడు

రాఘవ్ రావు ఓ పెద్ద అగ్రికల్చర్ సంస్థలో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు

కొత్త వంగడాలు సృష్టించడం లో సైంటిస్ట్ లు కి కోచింగ్ ఇస్తాడు మంచి జాబ్ అని అందరూ అంటారు

రైతులకు సలహాలు సూచనలు అన్ని ఇస్తు ఉంటాడు

ఆయన లో మంచి రచయిత ఉన్నాడు రేడియో లో పల్లె సీమల నుంచి ఎన్నో ప్రసంగాలు వచ్చాయి అంతే కాదు అన్ని కలిపి ఒక్ బుక్ గా వేయించి యూనివర్సిటీ లైబ్రరీస్ కి పంపాడు

ముఖ్యం అగ్రికల్చర్ కాలేజి లకు ఎక్కువ పంపాడు
ఎన్నో పత్ర సమర్పణలు చేశాడు

అతను కుటుంబ భాద్యతలు రిసెర్చ్ వర్క్ వల్ల పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు మంచి చదువు ఉన్న పిల్ల కోసం చూశారు

అయితే చదువు ఉన్న పిల్లలు సిటీ ఉద్యోగం చేస్తూ న్నారు

రాఘవ పని చేసేది పల్లెటూరు పొలాలకి దగ్గరగా ఉన్నది.

అందుకు చదువు ఉన్న ఆడపిల్లలు పెళ్లి ఆడటానికి
ఒప్పు కోలేదు సరే కళ్యాణ తార వస్తె అదే అవుతుంది అని ఊరుకున్నా మిగిలిన వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు
ఓ పెళ్లిళ్ల బ్యూరో అతను వచ్చి పిల్ల వేరే జిల్లాలో కాలేజి లెక్టేరర్ చేస్తోంది వాళ్ళు మీ సంబంధం వప్పు కొన్నారు అన్నాడు

ఆ పిల్ల ఎక్కడో ఖమ్మం జిల్లాలో చేస్తుంది మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ ఉండదు పశ్చిమ గోదావరి జిల్లా లో వాడు చేస్తున్నాడు అన్నాడు

అబ్బే పిల్ల సర్వీస్ వదిలి వస్తుంది పిల్లకి పాతిక ఏళ్లు దాటి పోయాయి అని తల్లి తండ్రులు బాధ పడుతున్నారు

అందుకని వారు ఆ పిల్లకి మంచి ఉద్యోగస్తుడు దొరికితే
ఉద్యోగం మాని పిస్తాము అన్నారు

సరే పెళ్లి చూపులు ఇష్టాలు ఉభయులూ మాటలు ఘనంగా సామరస్యంగా జరిగాయి

పిల్లలు ఇష్ట పడ్డారు పెళ్లికి శుభమ్ అన్నారు

అయితే పిల్ల ఒక విషయం చెప్పింది

మీరు అంతా ఒప్పుకుంటే నేను ఇక్కడ చెందిన చేసిన సర్వీస్ వదిలి ఆక్కడి కాలేజి లో పోస్ట్ పుచ్చు కో వచ్చును అన్నది

అసలు జాబ్ మానేసే కంటే న్యూ సర్వీస్ పోస్ట్ లో చేరడం మంచిదని కౌముది అభిప్రాయం చెప్పింది

దానికి అంతా సరే నీ ఇష్టం అన్నారు పెళ్లి ఘనంగా గా చేశారు
పచ్చి పూల మండపము డెకరేషన్ చేసేవాళ్ళు స్నేహితులు అంతా కలిసి ఆఫీసర్ గారి పెళ్ళిలో ఎంత బాగా ఆనందంగా పాల్గొన్నారు

రిసెప్షన్ కూడా అటూ ఇటు ఉద్యోగస్తులు వచ్చారు సంతోషంగా సందడి చేశారు

ఆ తరువాత కౌముది లాంగ్ లివే పెట్టీ భర్త దగ్గరికి వచ్చింది
అత్త మామ వేరే ఊళ్ళో ఉంటారు వారిది వ్యవసాయ కుటుంబము

పెళ్లి అయిన రెండేళ్ళకి కౌముది మళ్లీ కొత్త సర్వీస్ తో ఉద్యోగం లో చేరింది

కొత్త కాలేజి కొత్త మనుష్యులు

అందరూ తొమ్మిది ఏళ్ల సర్వీస్ వదిలి పెళ్లి చేసుకున్నందుకు
ఆశ్చర్యం పడ్డారు ఏమిటి మేడం మీరు పెళ్లి కోసం సర్వీస్ వదిలారు అన్నారు

భారత దేశం లో కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో వివరించి చెప్పింది స్టూడెంట్స్ అంతా కూడా విస్తుపోయారు

మోడరన్ కల్చర్ కాదు ఆన సంస్కృతి సంప్రదయాలపై అవగాహన ఉండాలి అని చెప్పింది ఎమ్మెస్ గానం ఎంతో రమ్యంగా ఇందరికి అభయంబు లిచ్చు చేయి అనే అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ఫోనే లోంచి వినిపిస్తోంది

అందరూ ఆనందం గా మేడం గురించి తెలుసుకున్నారు

జాతీయ సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థి దశ నుంచి నేర్చుకుంటే దేశానికి ప్రగతి అని చెప్పింది శాంతి శుభమ్

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!