ధీరుడిలా దూసుకుపో!

ధీరుడిలా దూసుకుపో!

రచన: వాడపర్తి వెంకటరమణ

మిత్రమా…
గత ఉపద్రవాల ఊబిని కలగంటూ
భయపడుతూ బిగుసుకుపోతుంటే
రేపటి ఉషోదయాల వెలుగు రేఖలను
నువ్వెలా ఆస్వాదించగలవు!

శిశిరానికి రాలిన పండుటాకుల వైనానికి
బాధపడుతూ కుమిలిపోతుంటే
వసంతానికి వేసిన లేత చిగుళ్ళను చూసి
నువ్వెలా ఆనందించగలవు!

విపత్తుల వలయాలు విలయాలై
నీ చుట్టూ ముసురుకున్నప్పుడు
ధీశాలిలా జీవితాన్ని నెట్టుకొచ్చావు
కష్టాల కడలిలో అలలు కూడికలై
ఉన్నపళంగా ఉప్పెనలా మారినప్పుడు
బుద్ధిమతంతో ముందుకు అడుగేశావు!

ఇప్పుడు కానరాని క్రిమి సంహారం కోసం
భీరునిలా వెన్నుచూపొద్దు మిత్రమా…
ధీరునిలా దూసుకుపోవాలి!

ఈ చీకటి మాయా మహమ్మారిని
పొలిమేరలదాకా తరిమికొట్టేందుకు
మనో ధైర్యమనే తారక మంత్రాన్ని
మనసు మందిరంలో జపించాలి!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!