ఈ ప్రకృతి….మనది

ఈ ప్రకృతి….మనది

రచన::రాయల అనీల

నీలాకాశం లోని ప్రశాంతమైన నీలి మేఘానికి కాకుండా
ఉరుములు మెరుపులు లాంటి ఉగ్ర రూపం దాల్చడానికి కారణం అయ్యామా ….
ప్రశాంతమైన గాలిని కూడా ఆస్వాదించలేక పోతున్నామా…..
ప్రాణ వాయువుని కూడా ఇతర దేశాల నుండి కొనుక్కుంటున్నామా….ఏమిటీ దుస్థితి

ప్రకృతి లో దాగిన వర్ణాలను చూడాలంటే ప్రకృతి తో మనం కూడా మమేకమై పోవాలి అప్పుడే మనకు ప్రకృతి అంటే ఏంటో తెలుస్తుంది.

ప్రకృతికి మనం కలిగిస్తున్న బాధను తట్టుకోలేక విలయ తాండవం చేస్తూ అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నా కూడా మనం లేకించట్లేదు .

ఈ ధరణి దాహం తీర్చడానికి వరుణుడే కరుణించి రాగా ఆ పుడమి తల్లి పులకించి పరవశించి పోతున్న ఆ ఆనందపు క్షణాలని చూసే అదృష్టం ఎంతటి భాగ్యం…….. అటువంటి దానిని చూడలేక పోవడానికి కారణం మనమే

లేదులే ఇవ్వన్నీ మనం చేసుకున్నవే …. ఎంతో అమూల్యమైన ప్రకృతి నుంచి వస్తున్న పంటలను  కాదు అని కెమికల్స్ కి బానిస అయ్యి మట్టిని సైతం కలుషితం చేస్తున్నామే , స్వచ్ఛమైన నీటిని పట్టించుకోకుండా వ్యర్దాలతో నింపి ఇప్పుడు మళ్ళి వాటినే ప్యూరిఫై చేసుకొని ,కొనుక్కొని తాగుతున్నామే , ప్రకృతి సంపదని ఇష్టమొచ్చినట్లు వాడుకొని దారికి అడ్డుగా ఉన్నాయని కొమ్మలనే కాకుండా చెట్లను వేర్లతో సహా పెకిలించి వేస్తున్నాం , అందమైన ఇంటికి చెక్కలు కావాలని , రకరకాల మంచాల తయారీకి, ఇలా అనేకరకాలుగా చెట్లను నరికి ఇప్పుడు మళ్ళి మొక్కలు నాటుతున్నామే ఎంత దౌర్బాగ్యం……

ఒక చెట్టు అడ్డుగా ఉన్నప్పుడు దానిని నాశనం చేయకుండా మరో మార్గం చూడాలి ….ఎటువంటి మార్గం కనిపించినప్పుడు ఆ చెట్టుకి బదులు మరికొన్ని మొక్కలు నాటాలి…… ఇవాళ ఆ చెట్టు నీకు అడ్డుగా ఉందని నరికేస్తావు….ఆ తర్వాత అందరూ అలానే చేసుకుంటూ పోతే మనం అడవుల్లోకి వెళ్తాం…. అక్కడ ఉండాల్సిన ప్రాణులు జనసంచారంలోకి వస్తాయి……
ఇప్పుడూ వస్తూనే ఉన్నాయి కదా అడవులు తగ్గిపోయి.. దానికి కారణం ఎవరూ మనమే ….మనుషులే….

మంచి స్వచ్చమైన కాలువల నీటిని సైతం ప్లాస్టిక్ వ్యర్థాలతో, వేయకూడని చెత్త మొత్తం నింపి మురికి కాలువలు ,చెరువులుగా తయారు చేస్తున్నాము…. అవి పారే నీటికి అడ్డుపడి ,చెరువులు నిండి  వర్షపు నీటిని సైతం ప్రాణ సంకటం గా మార్చి మన ప్రాణాలు మనమే తీసుకుంటున్నామ్

గాలి సైతం విష వాయువు లాగా తయారయ్యి ఏడాదికి లక్షల మందిని హరిస్తుంది…..
ప్రశాంతమైన గాలి అలా అవ్వడానికి కారణం ఎవరూ…..
పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుండి ,చెత్త ని కాల్చడం ,వాహనాల వలన వెలువడే పోగ మొత్తం గాలిలో కలిసి విషంగా తయారై ఊపిరి పీల్చుకొడం కూడా ప్రమాదం గా మారిపోయింది…..కాదు కాదు మనం మార్చేసుకున్నాం

చెట్లను పెంచితే అవి కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని మనకు ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది…… గాలి కాస్త మామూలుగా ఉంటుంది…. మనకు కనీస ప్రాణవాయువు అందుతుంది

కేవలం పర్యావరణ దినోత్సవం నాడు మాత్రమే కాదు ఇవ్వన్నీ తలచుకునేది…..
మనకే ఉండాలి..మనలో ఉండాలి
ఇకనైనా మారుదాం……
మన చేతుల్లో ఇప్పుడు ఉంది సాధ్యమైనంత వరకూ మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి ,వీలైనన్ని మొక్కలను నాటాలి ,నీళ్ళ ను ఇకనైనా కలుషితం చేయకుండా ఉండాలి, అనవసరంగా వాహనాల వాడకూడదు దానికి ప్రత్యామ్యాయం చూసుకోవాలి

అదీ ఇప్పుడే చేయాలి….

ఇవాళ చేద్దాం , ఆహా రేపు చేద్దాంలే , ఆహా ఈ సారి చేద్దాం లే అని వాయిదా వేసుకుంటూ పోతాం ఆ తర్వాత మర్చిపోతాం

మనిషి సహజ లక్షణం మరచి పోవడం కానీ ఆ నిర్లక్ష్యమే రేపటి మన పతనానికి నాంది అవుతుంది…..

అందుకే వాయిదాలు కాదు….
రేపటిది ఇవాళ..ఇవ్వాల్టిది ఇప్పుడే
ఇప్పటిది..ఈ క్షణమే
చేయాలి…..

అప్పుడే మనం బ్రతకగలం ….మన ముందు తరాలవారికి మనం అనుభవిస్తున్న ఈ దుస్థితి రాకుండా కాపాడుకుందాం….అదే మన బాధ్యత

ఇప్పుడే ఇలా ఉంది అంటే భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో …… అలా కాకూడదు…. అందుకే మన వంతు మంచి మనం చేద్దాం…… కేవలం నేను చేస్తే ఈ సమాజం బాగుపడుతుందా అంటే ….పడొచ్చు చెప్పలేము….. ఆ నూతన మార్పు కి నువ్వే నాంది అవ్వు….

ఇది మన కోసం….మన వాళ్ళ కొసం
ఈ ప్రకృతి ….మనది

మనం ఈ ప్రకృతి ని కాపాడుకుంటే ….ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది…..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!