జీవన పో(ఆ)రాటం

అంశం: ఇష్టమైన  కష్టం

జీవన పో(ఆ)రాటం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కందర్ప మూర్తి

తల్లి కడుపులో పిండంగా శిసువుగా అంతా చీకటి తలకిందులు అయోమయంగా ఉంటుంది.
అమ్మ  కడుపులో తొమ్మిది  నెలలు హాయిగా బజ్జుని
పైకి రాగానే వెలుగు చీకటి అంతా గందర గోళ
భూ ప్రపంచం.
ఒక్కసారిగా  కేర్  మనే  శబ్దంతో  కడుపు నిండా గాలితో ఊపిరి  మొదలవుతుంది.
క్రమేపి  పసిబిడ్డగా అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా
పాలు తాగుతు ఊసులతో పెరుగుదల మొదలవుతుంది.
తర్వాత బుడిబుడి నడకలతో పరుగుల ఆరాటం,
ఆపైన తోటివారితో ఆటలు పాటలు
బాల్యం పూర్తయి చదువులు పాఠశాలలకు రాకపోకలు.
విధ్యార్థి దశ పూర్తవగానే  ఉధ్యోగం  సంపాదన
తర్వాత అంకం, పెళ్లి సంసారం కుటుంబం
పిల్లలు వారి పోషణ చదువులు భావి జీవితం
ఉధ్యోగ విరమణ భాధ్యతల నుంచి విముక్తి
సీనియర్ సిటిజన్ గా విశ్రాంత జీవితం
మనుమలు  మనుమరాండ్రతో ఆటపాటలు
జీవిత  చరమాంకం, ఇదే మనిషి  జీవన పోరాటం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!