కలకో లేఖ

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

కలకో లేఖ

రచన: చిరునవ్వు rj రాల్స్

సుందరం నువ్వో పెద్ద రచయితవని డప్పు కొట్టుకుంటావుగా ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా నా అందాన్ని, నామీదున్న ప్రేమని కాకుండా తుంటరిగా..కవ్వింపుగా అనిపించే ఇంకేదానినైనా పోగుడుతూ లేఖ రాయగలవా అంది కీర్తమ్మ …నర నరాలను మీటి జివ్వుమని నా కళ్ళని తాకిన ఓ ప్రేమ కలా…నీకై రాస్తున్న ఈ లేఖను చదివి తొందరగా నన్ను చేర వస్తావని కోరుతున్నాను…అంటూ స్టార్ట్ చేసాడు సుందరం…. కీర్తమ్మ కల్పించుకుని అబ్బో ఎంత రసికుడివోమరి ఏకంగా నికొచ్చిన కలకే ప్రేమలేఖనా….. చూద్దాం చూద్దాం రాయి బాగారాయి……కీర్తమ్మ మధ్యలో ఆలా వాగితే బాగోదు…. సరే సరే రాయి మహాశయా….
ఒంటికి వయసొచ్చిందని నాకు గుర్తుచేస్తూ కళ్ళను ఆలా మూయగానే స్వర్గపు తలుపులు తీస్తూ మెల్లిగా నా బుర్రలో జూరిపోతావే… జూరిన మొదలు నన్ను వదిలి వెళ్లేదాకా ఒకటే హొయలు, హంగులు, పొంగులతో మత్తుగా హత్తుకుంటావే ఆ వెచ్చని కౌగిలి మత్తు ఎప్పుడెప్పుడు అని నా కళ్ళని పదే పదే ముస్తున్న రాత్రయితే కానీ రావే…..నీకెంతవరకు సమంజసం అనిపిస్తుంది …
పదుల్లో పనులు పెట్టుకుని కూడా నీ రాకకోసం హడావిడగా ముగుంచి నా శరీరంపై సుత్తిమెత్తని పాన్పు కప్పుకుని నీకు స్వాగతం పలుకుతే అల్లరి పిల్లలా ఎప్పటికో నన్ను తట్టిలేపడం నీకెంతవరకు సమంజసం అనిపిస్తుంది …..
నీకోసం మాత్రమే తపించేలా ఓరచూపులను..సొగసైన వొంపులను…సుందరిమనులనే కనువిందుగా ముందుకు తీసుకొచ్చి ఓలలాడించి నన్ను ఆటపట్టించడం నీకెంతవరకు సమంజసం అనిపిస్తుంది …..
ఇవన్నీ మధురంగానే ఉన్నా కూడా అప్సరసల అధరాలు అందబోతున్న సమయంలో నువ్ చేసే కొంటెపని అదే కళ్ళను తోసి ఒక్కసారిగా పరిగెడతావే అది నీకేమన్నా సమంజసం అనిపిస్తుంది …కీర్తమ్మ ఈ లేఖ పురాణం వినలేక ఆపవయ్య స్వామి ఏంటి కవ్వింపుగా ప్రేమలేఖ అంటే ఇలానా….. కలకి లేఖ బాగానే ఉంది కానీ తనని ఇంకోసారి ఇలా వెళ్ళిపోకు నాతోనే ఉండాలని మెల్లిగా అడుక్కున్నట్టు ఉంది…..ఆ.. అడుక్కోవడంలో శృంగారాన్ని కూడా తెచ్చేలా ఉన్నవే…..అయ్యో లేదు కీర్తమ్మ కవ్వింపుగా అంటె అందాన్ని పొదిగిన భామకి లేదా అందాన్ని గుండెగు హత్తుకునేలా చేసే కలకే రాయగలమని ఇలా ప్రయత్నించాను…. హ చాల్లే చాలా పెద్ద మోనార్కుడిలా ఉన్నావ్గా….ఏదైతేనే ఆడదాని అందాన్ని పదే పదే తలిచి కలలను రప్పించుకునే మీ తుంటరీ పోకిరరిలకి కలలు ఇలా మధ్యలో వదిలేసే మాయమవడమే సరి………ఊర్కో కీర్తమ్మ  ఈ తొంటరి ఊహలు కలలు కనడంలో మీ ఆడవాళ్ళ తరవాతే మొగాళ్ళు….నిజజీవితంలోమొగాణ్ణి ఉడికించడంలో అరితేరిన మీరు మీ కలలో కూడా ఉక్కిరిబికిరి చేయడంలో ఎంతమాత్రం తగ్గరేమోకదా….. సుందరం మా కలలు నాన్న భుజాన వాలెంత కమ్మగా.. అమ్మ చివాట్లంతా తియ్యగా.. అన్నదమ్ముల పొట్లాటలోని అనురాగమంతా… వయసొచ్చినా మగువ లోతుని కొలవలేని ఊహల ప్రయాణమంతా….తుంటరీ పనులు ఆ.. ఆలోచనలు ఒకే వయస్సుకు మాత్రమే అంకితం కాదుగా…ఈ మన వయస్సులోనే అందం ఒక్కటే దగ్గర బంధంగా కనబడే తుంటరి ఆలోచనలు రావడం సహజమేగా…..కీర్తమ్మ చాలు కడుపు బాగా నిండి పోయింది గడ్డి బాగా పట్టించేసావ్ వెళ్లి పడుకుంటా నా ఊహసుందరి ఈరోజైనా రాబోతుందేమో అంతా నా కల మహిమా……..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!