కృతజ్ఞత

కృతజ్ఞత

రచన:: సుజాత.కోకిల

దబేలున తలుపు చప్పుడు కావడంతో మంచంలో పడుకున్న పరమేశ్వరం గారికి మెలుకువ వచ్చి,
ఇంత ప్రొద్దున్నే ఎవరు అనుకుంటూ తలుపు తెరిచి చూశారు. ఎదురుగా రాములమ్మ ,ఏంటి ? ఇంత ప్రొద్దున్నే వచ్చావు ?మరేం లేదయ్యా రోజు పెందలాడే లేస్తారు. ఈరోజు లేచినట్టుగా లేరు, ఇటు పోతూ అదేంటో కనుక్కుందామని పిలిచానయ్య అలాగే కూరగాయలు ఏమైనా తీసుకుంటారేమోనని పలకరించటానికి వచ్చాను. అంది. తనెే రెండు రోజులకొకసారి వచ్చి మంచి చెడ్డలు అరుసుకుని కావలసిన కూరగాయలు ఇచ్చి పోతుంటుంది. “రాములమ్మ” అమ్మగారు ఉన్నప్పుడు అన్నీ తనే కావాల్సినన్ని ఇచ్చి పోతుండేది.

ఇప్పుడు ఆ అమ్మ గారు పోవడంతో ఇల్లంతా బోసిపోయింది.ఇంక ఒంటరి వాడయ్యాడు పిల్లలు కూడా దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో ఇంకా ఒంటరివాడై చాల బాధపడుతున్నారు. ఏంటయ్యా అలా ఉన్నారు. వండుకుంటున్నారా లేదా వండుకుంటున్నాను లేవెే మరి అలా ఉన్నారేంటి అయ్యా ? మొహం అంతా వాలిపోయింది.ఏమిటో రాములమ్మ నువ్వైనా వచ్చి ఎలా ఉన్నారని అడిగి పోతున్నావు.అంతకన్నా నాకు కావాల్సింది, ఏముంటుంది.”రాములమ్మ”అదేంటయ్యా? అలా అన్నారు. మీ ఇంటి ఉప్పు తిన్న దాన్ని నా కష్టాల్లో మీరు,అమ్మ ఎంతో ఆదుకున్నారు.నే మర్చిపోతానా, అయ్యా ? నాకు తండ్రి లాంటోళ్లు, మీరు పెద్దోళ్లయ్య అలా మర్చిపోతే నేను మనిషిని కానయ్య,
కళ్ళను తుడుచుకుంటూ “అంది”

అయ్య పిల్లలు ఫోన్ చేశారా లేదు రాములమ్మ. ఏంటోనయ్యా ఈకాలప్పిల్లలు అడ్డాలనాటి పిల్లలుకాని గడ్డాలనాటి పిల్లలు కారు వాళ్లకి రెక్కలు వచ్చాయి. ఎగిరిపోయారు.మన అవసరాలు లేకుండా? పోయాయి.ఒకప్పుడు ఎలా ఉండేటోళ్లు ఆ వైభవమే వేరు రాములమ్మ ఆ వైభవం తలుచుకుంటూంది.

కళకళలాడుతుండెే అందమైన పల్లెటూరు ఆ ఊరికి మకుటం లేని మహారాజు పరమేశ్వరంగారు ఎంతో పేరు పలుకుబడి ఉన్నవారు.తన చేతి కింద ఎంతోమంది రైతులు బతుకుతున్నారు.ఆ చేతులు ఎంతోమంది కడుపులు నింపాయి. తొణకని నిండు కుండ .గర్వంకానీ అహంకారం మచ్చుకైనా లేవు ఊర్లో అతణ్ని దేవుడిలా కొలుస్తారు.చుట్టూ గలగల పారే చెరువులు వాగులు అందమైన పండ్లతోటలు పచ్చ పచ్చని పంట పొలాలు ఆ ఊరిలో ఎప్పుడు ధాన్యలక్ష్మి తాండవిస్తున్నట్టు గానే ఉంటుంది.

ఆ ఊరిలో అన్న వస్త్రానికి లోటు లేదు. కాలుష్యం లేని వాతావరణం ఆప్యాయంగా పలకరించే పలకరింపులు
వీటి మధ్యలో వారి జీవితం అందరికీ ఆనందంగా ఉండేది. అందరి కష్టాలలో తనే ముందుంటాడు. ఇంటి నిండా పని మనుషులు పరమేశ్వరంగారికి, ముగ్గురు కొడుకులు వారిని పట్నం చదువులు చదివించారు. తండ్రికి తగ్గ తనయులు అని పేరు తెచ్చుకున్నారు. ఆ సంస్కారం ఎన్ని నాళ్లు నిలుపుకోలేదు.

మూడు నాళ్ల ముచ్చటే అయింది.మంచి ఉద్యోగాలు రాగానే అమెరికా వెళ్లిపోయారు. ఏడాది క్రితమే భార్య పోయింది. తల్లి పోయిన రాలేదు.భార్య పోవడంతో చాలా కుంగిపోయారు. ఇప్పటి పిల్లలు అంత పురుషార్థులు దగ్గర దగ్గర్లోనే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను చూస్తారని అనుకున్నారు. కాని వారి ఆశలు నేరవేరక నిరాశ మిగిలింది తల్లిపోయిన రాకపోవడంతో ఇంకా బెంగటిలారు ఎన్ని ఆస్తిపాస్తులున్న ఏం లాభం నా అన్నవాళ్ళు దగ్గర లేకపోయాక అదే జీర్ణించుకోలేక పోతున్నారు. ఊరి వాళ్లు అందరూ మధ్య మధ్యలో వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని ధైర్యం చెప్పిపోతారు. ఎంత చెప్పినా కడుపుతీపి బాధ వేరే ఉంటుంది.

అమ్మా ఇది పరమేశ్వరం గారిల్లేనా అంటూ వచ్చింది ఒక చేతిలో బాబు ఒక చేతిలో సూట్ కేస్ పట్టుకుని నిలబడి ఉంది పట్నం దొరసానిలా చక్కగా అందంగా ఉంది కట్టుబొట్టు అంతా అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ఉంది ధగధగా మెరిసిపోతోంది. రాములమ్మ ఆలోచనలనుంచి తేరుకొని ఎవరమ్మా అంది మామయ్య గారున్నారా అంది ఎవరు రాములమ్మ అంటూ పరమేశంగారు బయటకొచ్చారు. నెేనండి జానకిని లోపలికి రావచ్చాండీ రా అమ్మా అన్నాడు. పదండి లోనికి అన్ని విషయాలు వివరంగా చెప్తాను చాలా పరిచయమున్నట్టుగా ఉంది ఆ ధోరణి ఎంత ఆలోచించుకున్న అమ్మాయెవరో గుర్తుకు రావడం లేదు ఎక్కడ చూసినా ఛాయలు కూడా కనబడటంలేదు .

రాములమ్మ అమ్మాయికి మంచినీళ్ళివ్వు అన్నాడు అలాగేనయ్యా అంటూ మంచినీళ్లు ఇస్తూ కూర్చోండమ్మా అంది ఇప్పుడేనా రావటం తల్లి అన్నారు ప్రయాణం అలసటతో అలసి పోయినట్టున్నావ్ కాసేపు రెస్ట్ తీసుకో తల్లి
అన్నారు. అలాగే మామయ్య గారు అంటూ బాబుకు పాల బాటిలో పాలు కలిపి తీసుకురమ్మంది.అలాగే అంటూ, రాములమ్మ పాలు కలిపిన బాటిల్ తెచ్చిచ్చింది ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది.మామయ్య గారు మీరు నిదానంగా కూర్చోండి చెప్పడం మొదలు పెట్టింది.బాబుకి పాలు తాగిస్తూ మీకు సావిత్రమ్మగారు తెలిసే ఉంటుంది.కద అంది! సావిత్రి పేరు వినగానే ఏ మూలనో వున్న పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు సావిత్రి ఏక్కడుంది ఎలా ఉంది అంటూ ఆతృతగా అడిగారు. తనకు చేసిన అన్యాయమే నన్ను ఒంటరి వాణ్ణి చేసి బాధపెడుతుంది.

నేను తలచుకోని రోజంటూ లేదు అన్నాడు. ఆ కాలంలోనే మేము ఇద్దరుము ఇష్టపడ్డాము. పెళ్లి చేసుకోవాలనుకున్నాము.అదే విషయం చెప్పాలని సంతోషంగా ఇంటికి వచ్చాను మా మేనమామ బిడ్డతో నాకు పెండ్లి నిశ్చయం చేశారు. మా నాన్నగారికి మా విషయం చెప్పాను. మా అమ్మానాన్నలు నా మాట వినలేదు. నేను ఎంత బతిమిలాడినా నా మాట లెక్క చేయలేదు. మేము కావాలో అమ్మాయి కావాలో తేల్చుకోమన్నారు. అటు తల్లిదండ్రుల మాట కాదనలేక ఇటు సావిత్రి కిచ్చిన మాట నిలబెట్టుకోలేక ఎంతో కుమిలిపోయాను. తప్పని పరిస్థితుల్లో మామయ్య కూతుర్ని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నన్ను బయటకు పంపించలేదు.మళ్లీ ఇన్నాళ్లకు సావిత్రి మాట విన్నాను అంటూ ఏడుస్తూ బాధగా అన్నారు

నీకు సావిత్రికి ఏమీ సంబంధం తల్లి అన్నారు సావిత్రిగారు మా అత్తగారు మీకు మా అత్తయ్య కు పుట్టిన కొడుకు భార్యను తన తల్లిదండ్రులు పెళ్ళి చేసుకోమని ఎంత బతిమిలాడినా చేసుకోనని చెప్పింది తన కడుపులో మీ బాబు పెరగడంతో మిమ్మల్ని మర్చిపోలేక మళ్లీ ఎవర్నీ చేసుకోకుండా అలాగే ఉండింది .మీ అబ్బాయి గారు కూడా కారు యాక్సిడెంట్లో పోయారు ఆ బెంగతో అత్తగారు కూడా మొన్ననే పోయారు. నేను ఒంటరి పక్షిని నయ్యాను.మా అత్తగారు మీ విషయాలన్నీ చెప్పి మీరు ఎక్కడ ఉంటున్నారన్న విషయం తెలుసుకొని నన్ను మీ దగ్గరికి పంపించింది.అయ్యో తల్లీ ఇంత ఘోరం జరిగింద ఆ పాపం ఇలా అనుభవిస్తున్నాను.అంటూ కుమిలిపోయాడు.

ఏం భయపడకు తల్లి నేను ఉన్నాను నీకు తోడుగా ఇక్కడే వుండు అని చెప్పాడు.నీవు ఒంటరి దానివి కాదు తల్లి నీకు నేను తోడున్నాను ఆస్తులన్నీ నీవే నా కట్టెకాలే వరకు నీకు తోడుంటాను బిడ్డ అంటూ బాబును ఎత్తుకుని ముద్దాడాడు ఊళ్లో అందర్నీ పిలిచి నా కోడలని చెప్పి అందరికి పరిచయం చేసి ఇకనుంచి ఈ అమ్మగారు మీకు అండగా ఉంటుందని చెప్పారు. అందరు ఆ మాట విని సంతోష పడ్డారు నా వారసత్వం అంతా ఈ అమ్మాయి కే చెందుతుంది అని చెప్పారు.తన పిల్లలు తల్లి పోతేనే రాలేదు ఇంకా నెేపోతే వస్తారా అంటూ నిట్టూర్పు విడిచారు.

సావిత్రికి చేసిన అన్యాయం ఇలానైనా రుణం తీర్చుకుంటానని మురిసిపోయారు. నాకు ఈ ఆనందం చాలు అనుకుంటూ ఈ కోడలే నాకు బిడ్డ లేని లోటును తీర్చింది. నా మనవడితొో నా శేషజీవితాన్ని గడుపుతానని మురిసిపోయారు.

…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!