కుమారస్వామి కథ

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

కుమారస్వామి కథ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

పూర్వం ఒకసారి దేవతలకూ దానవులకు యధ్ధం జరగగా ఆ యుద్ధంలో దేవతలు పూర్తిగా ఓడి పోయారు. దీనికి కారణం దేవతలకు సమర్ధుడైన సేనా నాయకుడు లేకపోవటం అని ఇంద్రుడు ఊహించి దేవతలకు జరిగిన అపజయానికి విచారించాడు.
తక్షణ కర్తవ్యంగా ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి “చతుర్ముఖ మా దేవతలకు తగిన దేవసేనను సక్రమైన మార్గము లో నడుపించు నాయకుడు ఎక్కడ ఉన్నాడు.?”అని అడిగాడు. బ్రహ్మ ఇంద్రుడి తో “సోమసూర్నాగ్ని సంభవుడై వాడే దేవసేనను నడిపించి జయం చేకూర్చగలడు.” అని చెప్పాడు. బ్రహ్మ! ఇంతలో కైలాసంలో మునులు, ఋషులు, తపస్సు బృగీ,నందీశ్వరుడు,నారదుడుతో పాటు ప్రమద ఘణములు, శివపార్వతుల సమేతముగా కొలువు చేయచుండగా బాలగణపతిని ఒంటరిగా వదలి వేయగా ఒంటరి తనం నచ్చని వాడై బాల గణపతి కొలువులోని తల్లి పార్వతి దగ్గర కు వచ్చిఅమ్మా నాతో ఎవరూ ఆడుట లేదు బహుశా నా ఏనుగు తల అందులో తొండము ఉన్న నాతో ఏవరు ఆడుటలేదు, నాకు ఒక తమ్ముడు ఉంటే నాతో ఆడుకొనే వాడు నాకీ ఒంటరి తనం తీరును కదా అనగా అక్కడనే ఉన్న తపస్సు లు ఋషులు “బాలవాక్కు బ్రహ్మ వాక్కు” తక్షణం పార్వతీ పరమేశ్వరులకు ఒక అఖండ తేజస్సు గల కుమారుడు జన్మించ గలడు. వాడే నీకు తమ్ముడు కాగలడు. నీ కోరిక మేరకు అని దీవించారు.
ఇంతలో దేవేంద్రుడు సప్త ఋషులు కైలాసం లో ఉన్నారని ఎరిగి వారి వద్దకు పోయీ “ఈవిధంగా పలికారు. దేవతల విజయం కోరి ఒక యజ్ఞము చేయమన” ఋషులు అవస్యం అని ఒక గొప్ప యజ్ఞం ఆరంభించి, అద్భుతాగ్నిని ఆవాహనం చేశారు.” అద్భతుడనే ఈ అగ్నికి సప్త ఋషుల భార్యలను చూడగానే వారి పై కోరిక కలిగింది. ఈ సంగతి తలిస్తే ఋషులు భార్యలను శపిస్తారన్న విచారం తో కుంగిపోయి అగ్ని ఆత్మహత్య చేసు కోవటానికి యత్నించాడు.
ఇది గమనించిన పార్వతి పరమేశ్వర్లలు అగ్నిని కాపాడటానికి ఒక పన్నాగం చేశారు. ఈశ్వరుడు అగ్ని లో ప్రవేశించి అతని ప్రాణాలు కాపాడాడు. పార్వతీ దేవి అగ్ని మొక్క భార్య అయిన స్వాహాదేవిలో ప్రవేశించింది. అప్పుడు స్వాహాదేవి సప్త ఋషుల భార్యల రూపులు ధరించి అగ్నిని ఆకర్షించింది. అమె వసిష్టుడు భార్య అయిన అరుంధతి రూపు మాత్రమే ధరించ లేక పోయింది. మిగిలిన ఆరుగురు రూపాలూ ధరించింది.
ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు అంశంతో అద్భతాగ్నికి స్వాహాదేవికీ ఒక మహా శౌర్య సంపన్నుడైన కుమారుడు కలిగాడు ఆ కుమారుణ్ణి కృత్తికలు గంగా నది తీరంలో పెంచారు. “అతనే కుమారస్వామి” కోద్దిరోజుల పిల్లవాడుగా వున్నప్పుడు అతను మదగ జాలను సయితం ఆవలీంగా మచ్చిక చేశాడు.  ఒక్కొక్కబాణం తో ఒక్కొక్క పర్వత శిఖరాన్ని భేదించాడు.
ఇంద్రుడు ఒకషష్టి నాడు దేవసేనను ఒక కాన్యారూపంలో తెచ్చి కుమారస్వామికి పెళ్ళి చేశాడు.అందుచేతనే కుమారస్వామి అతిథి ప్రియమైనది. కుమారస్వామికి దేవసేనకూ వివాహం అయిన సమయాన సమస్త దేవతలూ, దిక్పాలకులూ, బ్రహ్మ, పార్వతి పరమేశ్వరులు, వచ్చారు. తరువాత పార్వతీ పరమేశ్వరులు తేజోవంతమైన సింహాల రథం మీద కుమారస్వామినీ, దేవసేననూ కూర్చోబెట్టుకొని ఊరేగింపు చేయగా రథానికి ముందు గా కుబేరుడు తన పుష్పకవిమానం ఎక్కి కదిలాడు. రథానికి ఒక పక్క అష్టవనువులూ, ఏకాదశరుధ్రులూ, మరోక పక్క దిక్పాలకులూ, బ్రహ్మ,రుధ్రులూ ఉన్నారు.
వీరందరూ వెంట రాగా కుమారస్వామి మహా వైభవంగా భద్రపటం చేరి ఆశీస్సులు పొంది అక్కడ నివాసం ఏర్పరచు కున్నాడు. కొంత కాలానికి మషిషాసురడనే రాక్షసుడు రాక్షస సేనలను వెంట సమకూర్చు కొని దేవతల పైకి దండెత్తి రానే వచ్చాడు.
రాక్షస సేనలు ఆశ్రమాలు ధ్వంసం చేశాయి, యజ్ఞం లను భగ్నంచేశాయి,నిరాయుధులైన, సాధువులను హింసించి,పీడించాయి.వీరినందరినీ రక్షంచటానికి వచ్చిన దేవసేనకూ రాక్షసలకు భయంకరమైన యుద్ధం సాగింది. ఈ యుద్ధం లో దేవతలు మహిషాసురుడి ధాటికి ఆగలేక చెల్లా చేదురై పారి పోయారు.
బ్రహ్మ వల్ల అనేక వరాలు పొందిన మహిషాసురుడు విజయ గర్వంతో పరమేశ్వరుడు ఉన్న చోటికి వెళ్లి ఆయన రథాన్ని పట్టకున్నాడు. మహిషాసురుడి శక్తి కి పరమేశ్వరుడు కూడా ఓడిపోయాడని సంతోషించిన రాక్షసులు విజయనాదాలు చేశారు.
అప్పుడు పరమేశ్వరుడు కుమారస్వామి ని తలుచు కున్నాడు. వెంటనే “కుమారస్వామి యుధ్ధ సన్నిద్ధుడై శక్తిని చేతధరించి కోపావేశంలో కళ్ళ నిప్పులు రాలగా మహిషాసురుడి పైకి వచ్చి ఆదుర్మార్గుడు పై శక్తి ని విసిరాడు.దాని దెబ్బకు మహిషాసురుడు తలపగిలి పోయి వాడు కొండవిరిగి పడ్డట్టు పడి కుమారస్వామి పైకి రాగా వాడిని చిత్రవధ చేసి యమపురికి పంపేశాడు. యుద్ధం ముగిసింది. దేవతలు “కుమారస్వామి పై పూలవర్షం కురిపించారు.

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!