వంట గదిలో దెయ్యం

వంట గదిలో దెయ్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

అది నరసారెడ్డి ఇల్లు అందరూ ముద్దుగా నరసన్న అని పిలుస్తారు. నరసయ్య కు ఆరు మంది సంతానం అందలో చివరి వాడు పిచ్చిరెడ్డి అందరి కన్నా చిన్నవాడని ముద్దుగా పిచ్చియ్య అని పిలిచేవారు! అది మన పిచ్చిరెడ్డికి ఇష్టం లేక పోయినా ఇంటా బయటా అలా! పిలవడం చేతా పిచ్చిరెడ్డి పిచ్చయ్య గా మారి పోయాడు. బడిలో కూడ రిజిష్టర్ లో పిచ్చయ్య అనే వ్రాపిచ్చారు. అలా చివరివాడు కావడంతో ముద్దుగా పెరిగాడు. స్నేహితులు కూడా పిచ్చయ్య అని పిలవడం తమాషాగా ఉండేది అలా పిచ్చయ్యకు పెళ్లి ఈడు వచ్చింది కానీ పిచ్చయ్య పని పాట లేకుండా స్నేహితులులతో తిరుగుడు ఎక్కువ అయింది. అందకే మేనత్త కూతురు వచ్చిందని పెళ్లి చేస్తే బాగుపడుతాడని పెళ్ళి చేసారు. రెండు మూడు సంవత్సరాలు గడిచింది. పిచ్చయ్య మాత్రం ఏమి మారలేదు. స్నేహితుల తో కలిసి తిరగడం పరిపాటి అయింది. ఇది గమనించిన మామ అల్లుడిని కూతురిని ఇక్కడ నుంచి స్థలం మారిస్తేగాని అల్లుడు మారడని తన ఊరికి తీసుకుని పోయి తన దగ్గర పెట్టుకొంటే ఏమైనా మార్పు వస్తుందేమో అని బావించి. ఒకరోజు వచ్చి మేనత్త  ఇద్దరిని తన తోపాటు తీసుకు రమ్మని పంపిందని అల్లుడితో కూతురి తో చెప్పగా! పిచ్చయ్య తన స్నేహితులను వదలి రావడానికి ఇష్టపడక పోగా భార్యను మాత్రం మే పంపుతానని మామ తో చెప్పాడు. మామ బాగ పట్టుపట్టగా! వారితో బయలుదేరాడు. సరే!  ఇంకేమని అల్లుడు వచ్చాడు కదా! చిన్నగా మార్చుకోవాలని అత్త మామ మనసులో అనుకున్నారు. “ఇలా ఒక నెలరోజులు తెలియకుండా నే జరిగి పోయింది. ఈనెల రోజులలో పిచ్చయ్యకు ఇక్కడ కూడా స్నేహితులు తయారు ఐనారు.”ఒకరోజు ఆ ఇంటి లో ఏమి జరిగిందంటే” చిన్న పెద్ద స్నేహితులు కలసి అలా! ఆ ఊరి చివర లో ఉన్న తోట విహారానికి పోయి అక్కడే సరదాగా రకరకాల వంటలు కోడికూర వడలు పిండివంటలు ఒకటా రెండా చాల వంటలు చేసుకొని అందరూ కలసి వనభోజనాలు చేసారు. అయితే మధ్యాహ్నం  భోజనాలు అలస్యం అవటం చేత మధ్యాహ్నంచేసి భోజం అరగక అందరూ రాత్రి భోజనం మానేశారు. కానీ మన పిచ్చయ్య భోజనం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం సరిగా చెయ్యలేదు. అందుచేత పిచ్చయ్యకు రాత్రి బాగా ఆకలే సింది. కానీ ఎవ్వరూ భోజనం చేయలేదని సిగ్గు తో  తాను రాత్రి కి భోజనం మానేశాడు..ఎందుకైనా మంచిదని అత్తమామలు, తరువాత భార్యతో, చివరికి చుట్టాలు వచ్చి బ్రతిమాలారు. పిచ్చయ్య వద్దంటే వద్దున్నాడు. భార్యచేత చెప్పించాడు. మామ అత్త నిజంగానే మధ్యానం అన్నం అరగలేదేమో పాపం అని అనుకొని వంటగదితో సహా తలుపు తాళం వేసి అలా ఆరుబైట చెట్ల మధ్య లో అందరూ పక్కలు వేసుకొని నిద్రపోయాడు. అంతే బాగ అలసి పోయినట్లు ఉండారు. అందరూ నిద్రపోయారు. కానీ పిచ్చయ్యకు నిద్రపట్టితేగా! ఒకపక్క కడుపు కాలుతుంది. ఒక జాములో నిద్రలేచి పక్కనే ఉన్న స్నహితున్ని లేపాడు, వాడు నిద్రలో ఎంది? అని అన్నాడు, ఆకలి, ఆకలి, భలే ఆకలి రా, అన్నాడు. మీరు నిజంగా కడుపు నిండా భోజనం చేశారేమో! గాని నా సంగతి తెలుసుగా, ఆకలి మండిపోతుంది, చెవిలో “గుప్ గుప్, అంటుందిరా, నిద్రరపట్టటంలేదు అన్నాడు పాపం వాళ్లకి ఏమి అర్దం కాక అటూ ఇటూ చూసి వంట ఇంటికి తాళం వేసి ఉంది. సరే నని ఆ వంటి గదికి పొగ గొట్టం ఉందని గమనించి అందలో నుంచి నిచ్చెన దింపుతాము చిన్నగా లోపలికి దిగి ఏమైనా ఉంటే తిని కేక వేయి మల్ల నిచ్చెన పట్టుకుంటాము పైకి వచ్చే అని ఉపాయం చెప్పారు. కానీ పిచ్చయ్య కు నీరసం ఆకలి దంచ్చేస్తుండటంతో ఉండపట్టలేక ఆకలి ఆకలి అని కేకలు పెడుతూనే ఉన్నాడు. అది కాస్త మేనత్తకు ఇనపడింది. మొగుడిని లేపి అయ్యా ఇదిగో వద్దంటున్నా పిల్ల, జల్లాని, వేసుకుని సమాదుల మిట్ట దాటి వద్దయ్యా అంటే విన్నావా! ఇప్పుడు చూడు ఏదో “ఆకలి దెయ్యం”ఇంటికే వచ్చేసింది. ఇందాకటి నుంచి ఒకటే ఆకలి ఆకలి అని కేకలు వేస్తుంది. అని చెప్పగానే అతగాడు తడుము కోకుండానే పకీరు ఇంటికి దారితీశాడు. ఇంతలో పిచ్చయ్య పొగగొట్టంలో నుంచి దిగి లోపల ఉన్నవి అన్ని వడ్డించుకోని తినడం ఎక్కిల్లు పెట్టడం మొదలు పట్టాడు. అది విని మేనత్త వంటగదిలో దెయ్యం ఉందో అని అరపులు పెట్టింది. ఇది విన్న స్నేహితులు నిచ్చెన బయటకు లాగి నిద్రపోతున్నట్టు నటించ సాగారు. కొంత సేపటికి పిచ్చయ్య పొగ గొట్టం లోనుంచి ఆకలి తీరింది బయటకు రానా అన్నాడు. నిచ్చెన కోసం, పిచ్చయ్య స్నేహితలకు వినపడ లేదని కాస్త పెద్ద అరవసాగాడు. మామ పకీరు ఇంటికి పోయి వనభోజనం చేసి అందరం తిరిగి వచ్చేటప్పుడు. మాతోపాటు “దెయ్యం కూడా వచ్చేసింది” అది నీసు దెయ్యం అందకే నేరుగా వంటగదిలోకి దూరింది. మాకు భయంగా ఉంది నీవు వెంటనే వచ్చి దాన్ని పట్టి తరమాలి అన్నాడు. పకీరు ఒక్కసారిగా గడ్డం మీసాలు సవరించి దాన్ని పట్టుకోడడానికి కావలసిన సామగ్రి తీసుకొని వచ్చేలోపు. ఇంటిల్లిపాది లేచి కంగారు పడుతున్నారు. ఇంతలో మామ పకీరు వచ్చి వంటగది గుమ్మం ముందర ఎవో గీతలు గీసి నిమ్మకాయలు కోసి పెట్టి ఇంకా ఏదో బూడిద చల్లి  కారు కూతలు కూస్తూ ” హోం” “హీం”భూత, ప్రేత, పిశాచిహీ, భేతాళ, నమ, అంటూ భలే ఆర్భాటంగా మంత్రాలు చదివేస్తున్నాడు, పకీరు. ఆ తరువాత పకీరు అక్కడ ఉన్న వారికి కొంతమందికి వేపమండలు కొంతమందికి మంత్రించిన బూడిదను కొంతమంది చేతికి కోరడాలు ఇచ్చిఇదిగో అందరూ జాగ్రత్తగా వినండి! నేను తలుపులు తాళం తీసి లోపలికి పోయి ఆ “వంటగదిలో ని దెయ్యాన్ని బయటికి తోలుతాను. అది తెల్లగా ఉంటుంది. మీరందరూ దాన్ని బాగా చావ భాదండి అది ఈ వంటగదికి కాదు కదా! ఈ ఊళ్ళో కి రావలన్న భయపడాలి!  అంటూ! మరో విషయం అది నేను కాదు, నేను కాదు అని అంటుంది. అయినప్పటికీ మీరు కఠినంగా నే ఉండండి అని చెప్పి తెలుపులు తెరవ సాగాడు.పకీరు. ఈ మాటలన్ని పిచ్చయ్య లోపలనుండి విన్నాడు. గబ, గబ అక్కడ వెతక గా ఒక బస్తా బియ్యం పిండి మూట కనిపించింది. దాన్ని రెండు చేతులతో ఎత్తి జాగ్రత్తగా పట్టుకున్నాడు. పకీరు లోపలికి రాగానే  “దభీ” మని ఆపిండిని గుమ్మరించాడు. పకీరు పిండి పడగానే చచ్చానురో! అంటూ బయటకు దూకేడు ఒంటి నిండా పిండి వల్ల తెల్లగా కనిపించాడు. పకీరు. ఇంకేముంది? వంటగది ముందు ఉన్నవారు బాధడం మొదలుపెట్టారు. ఎవరి వాటంకొద్ది వారు,”బాబో నేను కాదు, నేను కాదు అని పకిరు అరిచినా లాభం లేక పోయింది. దెయ్యం పారిపోయేలా కొట్టుతున్నారు. ఇంకా పకిరు ఇప్పటికి పారిపోతేనే మంచిదని ఉడాయించాడు. అంతటితో వంటిగదిలో దెయ్యం మీడ విరగడ అయిందని అందరూ ప్రశాంతంగా కాసేపు కునుకు తీశారు. పకీరు మాట కూడా మరచి, ఇదే సమయంలో పిచ్చయ్య కూడా నిద్రపోతున్నట్టు నటించాడు. తెల్లవారగా పకీరు గుర్తుకు వచ్చి మామ వెళ్ళి చూడగా చాలా దీనపరిస్థిలో ఉండటం గమనించి “పకీరు రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టి నప్పుడు బాగానే ఉన్నారు!  ఇదంతా ఏమిటి? అని అడిగాడు, దానికి పకీరు దెయ్యం చేసిన నిర్వాకం చెప్పగా మామ విచారించి. ఇంటికి తిరిగి రాగానే, పిచ్చయ్య ఏమీ తెలియనట్టు గా మామ రాత్రి ఎంది గొడవా అన్నాడు. అదా! రాత్రి వంట గదిలో కి ఆకలి దెయ్యం చోరపడితే దాన్ని ఆ పకీరు వచ్చి చితకబాధి తరంకొట్టాడు. లే నాయనా! అన్నాడు. ఇంతలో అత్తగారు మరీనూ అంది. ఆ రోజు ఆ ఇంట్లో జరిగినది తలచుకుని పిచ్చయ్య స్నేహితులు పిచ్చయ్య ను “వంటగది లో దెయ్యం”అని అంటూసాగారు. పిచ్చయ్య చాల్లేరా!అనేవాడు నవ్వూకొంటూ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!