సమయం

సమయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధురి మేక

కాలం యొక్క విలువని డబ్బుతోనే గెలుపుతోనో ముడిపెడతారు, ఈ క్షణం గడిచిపోతే తిరిగిరాదు అని చెప్తూనే క్షణం వృధా చేస్తే మార్కు లు తక్కువ వస్తాయనో, లేక ఓడిపోతారు అని చెప్పి సమయం విలువని చాలా చిన్నది చేస్తారు. ఒక క్షణం మనలో మౌనం కరువయ్యింది. ఒక క్షణం చేదరని నిశ్శబ్దం కోరవడింది. ఒక క్షణం ఆలోచనలకు నిలకడ లేకుంది. అంతేనా ! ఒక్కసారి కరిగిపోతే తిరిగి రాని క్షణానికి మనమిచ్చే విలువ ? పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోనెందుకో, లేక జీవితంలో గెలిచెందుకోనా? మనం చిన్నతనం నుండే పిల్లలకి సమయాన్ని డబ్బుతో, గెలుపుతో చూడాలి అని ఇలా అలవాటు చేస్తే  పెద్దయ్యాక వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఆలోచించండి. సమయం విలువైంది అన్నిటికంటె! ఒక్కసారి గడిపితే తిరిగిరానిది !! అంతటి విలువైన సమయం గురించి మనం పిల్లలకి చెప్పాల్సింది “నీ చేతిలో ఉన్నా ఈ క్షణం నువ్వు సంతోషంగా ఆస్వాదించాలి, సరైన ఆలోచనతో గడపాలి, ఎవరికైనా సహాయ పడడానికో కొత్త విషయాలు నేర్పుకోవడనికో వినయోగించుకోవాలి”. ఇది పిల్లలో ప్రతి క్షణం గెలుపు కోసం పరిగెత్తాలి అనే హడావిడిని కానీ,  గెలవకపోతే ఎలా అనే ఆతృతని కానీ కలిగించదు. సమయాన్ని ఆలోచించి వెచ్చించి, ఆనందానికి ప్రాముఖ్యతని ఇచ్చే పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా అనుకున్నవి సాదిస్తారు.

ఒక క్షణం మౌనంగా ధ్యానం
ఒక క్షణం చక్కటి చిరునవ్వు
ఒక క్షణం మెదడుకి పదును
ఒక క్షణం పూర్తి నిశ్శబ్ధం
ఒక క్షణం ఒంటికి వ్యయమం
ఒక క్షణం పరులకు ఉపకారం

ఇలా వేటికి ప్రాముఖ్యతని ఇవ్వాలో నేర్పిస్తే.. చక్కటి అలవాట్లు, చురుకైన ఆలోచనలతో పాటు. చదువు, గెలుపు అదనపు లాభాలు. గెలుపు కోసం ప్రతి క్షణం పెట్టె పరుగులో కాదు, నిజమైన సంతోషం మనం ఆగి వచ్చిన దూరాన్ని తిరిగి చూసి ఒక క్షణం ఆనందించడంలో ఉంటుంది. అని తెలియచేయాలి.
రేపటి తారలకు అమ్మమ్మగారి ఊళ్లో పొలం పని చెయ్యడం, విధేశాలలో ఉద్యోగాలు చెయ్యడం అన్నింటిని గెలుపులా చూడగలిగే మనస్తత్వం అలవర్చాలి. గెలుపు చేసే పనిలోనో, సంపదలోనో కాదు మన లోపల మనం వెతుకునే ఆనందంలో ఉందనీ నమ్మాలి, సమయాన్ని ఆ ఆనందం కోసం వెచ్చించాలి. మనిషి ఎప్పుడూ తనతో తను సంతృప్తిగా సంతోషంగా ఉండడమే నిజమైన విజయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!