పోనీ పెళ్లి చేసుకుంటే !

పోనీ పెళ్లి చేసుకుంటే !

రచన::బి హెచ్.వి.రమాదేవి

ఆ రోజు ఇల్లంతా సందడిగా ఉంది. అందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.అక్కడ ప్రతివారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు .ఇదెక్కడి విడ్డూరం అంటూ… అర్చన అప్పుడే ఆఫీస్ నుండి వచ్చింది.
” ఏమిటీ ఇదంతా”.చిరాగ్గా అంది.
” అమ్మా! మన ఇంటికి మగవాళ్ళు వస్తున్నారట. వాళ్ళతో నువ్వు నవ్వుతూ మాట్లాడుతున్నావ్ అంటున్నారు” షర్మి చెప్పింది.
” మగవాళ్ళు రావడం యేమిటి!? అర్థంకాని విధంగా చూసింది.” అర్చన.
“ఏమో నాకేం తెలుసు!? భుజాలెగరేసింది.” షర్మి.
” ముందు మంచినీళ్లు యివ్వు” చికాకుగా అంది.
” షర్మి ! నేను వచ్చాక ఎవరన్నా వచ్చారా !? “అన్నది.
“లేదన్నట్లు తలాడించింది షర్మి”
“సరే! పద లోనికి” అని వెళ్ళ బోతుండగా
” ఏమమ్మి! మాకు సమాధానం చెప్పి వెళ్ళు”అన్నాడు రాయుడు.
వాడు రెండు మూడు సార్లు ఉంపుడుగత్తెగా ఆఫర్ ఇస్తే తాను తిరస్కరించింది.
చిన్నగా నవ్వు వచ్చింది.
“అడ్డమైన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన పనిలేదు పద షర్మి!.”
“ఇక్కడ ఎవరి కొంపలు కూలుస్తావు నీ అందం తో, వలతో” వాడి పెళ్ళాం అంటోంది.
అర్చనకు కోపం రాలేదు. జాలేసింది ఆమెపై. ఆమెకు ఆడవాళ్ళ పైనే చాలా దయ కలిగింది. భర్త పై కాకుండా, అతడు ఆశ పడ్డ అమ్మాయిల పైన ద్వేషం పెంచుకుంటారు. వాడి వంకర బుద్ధి సరి చేయ లేరు.
అదెవత్తో మా ఆయనని వలలో వేసుకుంది. వచ్చి మీద పడుతుంటే మగాడు ఏం చేస్తాడు అంటారు. వచ్చి మీద పడిన ఆడవాళ్ళను అదే చేస్తాడు కాబోలు. వాడికి మనసుండదు. వచ్చి మీద పడ్డా అమ్మాయిలు వినియోగించు కోరు. పవిత్రత పోతుందని భయం! అసలు అసహ్యం. పవిత్రంగా ఉండేటటువంటి ప్రవరాఖ్యులు కూడా లేక పోలేదు. ఇది ఎలా ఉందంటే ఇక్కడ ఉండాలంటే మర్యాదగా మాకు లొంగాలి. లొంగక పోతే నీ పాతివ్రత్యం పైననే మచ్చ వేస్తామన్నట్లు. వెధవ మెచ్యూరిటీ, అదేమిటో ఎవరు ఏమన్నా కోపం రాదు. ” వీళ్లకు సమాధానం చెప్పక్కర లేదు. నువ్వు రా” ఇంట్లోకి దారి తీసింది.
” నాన్న ఎందుకు రావడం లేదు.? నువ్వు వెళ్ళగొట్టావట. నీ ఆటలు సాగవని .. పదవ తరగతి చదువుతున్న. కూతురి మాటలుకు బిత్తర పోయింది.
ఎవరన్నారు!? అని అడగాలను కోలేదు. ఎందుకంటే పర్సన్ ఎవరని కాదు. పిల్లల మనసులు ఎలా పొల్యూట్ చేస్తున్నారన్నది పొయింట్.
కొడుకు క్రిష్ వచ్చాడు. వాడు ఇంటర్మీడియేట్ ఫైనల్ చదువుతున్నాడు. కరోనా పుణ్యం కాకపోయినా నంబర్ వన్ స్టూడెంట్. కొంత అర్థం చేసుకుంటాడు. అసలు ఏమని చెబుతుంది ఆఫీస్ లో ఎవరో ఒకరు వస్తుంటారు. వాళ్ళు, ఆడ మగ వస్తుంటారు. వాళ్ళతో ఏడుస్తూ ఏమి మాట్లాడుతుంది.? భర్త దగ్గర వుంటే ఎవరితో నైనా మాట్లాడ వచ్చన్నమాట; తల బద్దలవుతుంది. తన లాంటి ఆడవాళ్ళకు ఇవన్నీ తప్పవు. ఎవరో ఒకరి కేరాఫ్ లో బ్రతకాల్సిందే. ఆ అమ్మాయి నిప్పు, అని ఒక్కడన్నా చెబుతాడా!? లేదు. నిప్పు లేనిదే పొగ రాదని, ఏదో పగ బట్టినట్లు చెబుతారు.
దీనికి పరిష్కారం ఆలోచించకపోతే ఇంకా పిల్లల మనసులు పాడై పోతాయి. నిజానికి భర్త వ్యసనాలకు ఆస్తి హారతి కర్పూరం అయిపోయింది. కానీ చిన్ననాటి స్నేహితునికి అక్రమ సంబంధం అంటగట్టాడు. లేనిది అంటే తట్టుకోలేకపోయింది. తాను వున్న విషయమే తాను అనలేదు. ఎందుకో వేరే స్త్రీతో వున్న తన భర్తను తెలిశాక యాక్సెప్ట్ చేయలేకపోయింది. అందుకే విడాకులిచ్చి వదిలించుకుంది. ఇప్పుడు అతడు ఆమె దగ్గరే ఉంటున్నాడని తెలిసింది. తనకు నింద వచ్చిన నాటి నుండి విశాల్ ను ఎప్పుడూ కలవలేదు. అతడు పెళ్ళే మానుకున్నాడని,, దానికి కారణం తనపై వన్ సైడ్ లవ్ అని తెలుసుకుంది. ఒక నిశ్చయానికి వచ్చాక చెప్పులేసుకుని బండి స్టార్ట్ చేసింది.
ఒకగంటలో వస్తాను. తలుపు లేసుకోమని పిల్లలకు చెప్పింది.
*******”
“హాయ్! బహుకాల దర్శనం. అర్చన! ఏమిటీ సర్ప్రైజ్!” అన్నాడు.విశాల్!
” గుండె దడ దడ లాడింది”
నిజంగా అమ్మాయిలా ఫీల్ అయ్యింది
తను కాఫీ జేసి తీసు కొచ్చాడు. ఏవో పళ్లు కట్ చేసి పెట్టాడు. బ్రహ్మచారి ఇంట్లో ఇంతకన్నా ఉండవు. ఏమి చెప్పాలో తెలియక పొడవాటి
జడను ముందుకు వేసి వ్రేళ్ళతో
తిప్పుతుంది. చాలా అందంగా వున్నాడనుకుంది. ఛీ,! ఛీ ఇలా ఆలోచిస్తుందేమిటీ తను!
విశాల్ నేను నిన్ను ఒకటి అడగాలి అంది తటపటాయిస్తూ..
చెప్పు అన్నాడు కాఫీ ఇస్తూ..
జరిగిందంతా చెప్పింది. తనను పెళ్ళిచేసుకుని ఈ బాధ తప్పించమన్నది.
పక పక నవ్వాడు. విశాల్…! చూడు అర్చన నిన్ను నేను ఆరాధిస్తూనే వున్నాను. కాని ప్రేమ అవసరం కోసం కాదు. ఆరాధన, ఆత్మీయత తప్పుగా ఆలోచించకు. ఇలా బ్రతికేస్తాను. ఎవరైనా చచ్చిపో అంటే చచ్చిపోతామా!? నిన్ను మరచిపో అంటే మరచి పోతానా! అలాగే! ప్లీజ్ వాళ్ళకోసం నన్ను పెళ్ళిచేసుకుని భార్యవు కావడం కరెక్ట్ కాదు. ప్రేమ వస్తేనే చేసుకో! వెళ్ళు భుజం తట్టాడు.విశాల్ ఆకాశమంత ఎదిగి తనకు ఆత్మవిశ్వాసం ఇచ్చి నట్లు అనిపించింది. అర్చన దృఢంగా ముందుకు అడుగులు వేసింది. ఇప్పుడే బాధ లేదు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!