శ్రీకారం చుట్టాలి

శ్రీకారం చుట్టాలి

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వి.వి.వి.కామేశ్వరి (v³k)

మరణం అనివార్యమని తెలిసినా
ఆ సమయం ఆసన్నమయితే
ఎవరికయినా భయమే!
అందులోనూ ముందే తెలియడం కేవలం, మహిమాన్వితులకో తపస్సంపన్నులకో తప్ప
సామాన్యుల విషయంలో అసామాన్యమే!
అయినా, డెబ్బది రెండు వేల నాడుల సమాహారమయిన దేహంతో ముడిపడిన
ఆత్మకు మోక్ష ప్రాప్తి వస్తే
అంతకన్నా కావలసినదేముంది!
నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే
మరణ మాసన్నమయిందని తెలియటం
కొందరికి వరమయితే
మరి కొందరికి అవుతుంది అది శాపంగా!
కంటి చూపు తప్ప నోటి మాట లేక
మృత్యుదేవతకై కన్నులు కాయలు కాసేలా
నిరీక్షించే వారికది గొప్ప వరమే!
కష్టానికి ఫలితం అందుకునే తరుణంలో
యమపాశం ఇదిగోనే వస్తున్నానంటే
కర్మ ఫలం అనుభవించే మనిషి దృష్టిలో
శాపం కాక వరమెలా అవుతుంది!
అందుకే, ఎప్పుడు వరిస్తుందోనని
వాయిదాలు వేయక ఈ క్షణమే సత్యమని
శ్రీకారం చుట్టాలి సత్కార్యాలకు
శీఘ్రంగా సంపూర్ణతను సాధించేలా !

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!