తొలకరి జల్లు

తొలకరి జల్లు

రచన: చెరుకు శైలజ

తొలకరిజల్లులో పుడమి పులకించే
ప్రకృతి ఆనందించే
ఆకాశంలో హరివిల్లు విరిసే
చిన్నారుల మోములో నవ్వులు వెలిగే
రైతుల కన్నులలో సంతోషం పొంగే
ప్రతి మొక్క పచ్చదనంతో పరవశించే
చెట్లు పచ్చదనంతో కళకళలాడే
భూమి పైన పచ్చదనం తివాచీ పరిచే
చిన్న పిల్లలందరూ ఆ జల్లులలో చిందులు వేసే
కవుల మనసు ప్రకృతిని చూసి కవితలతో ఉప్పొంగిపోయే
వాగులు వంకలు నీళ్ళతో నిండిపోయే
చిలుక గోరెంకలు వాటి గూటికి చేరే
అలసిన సూర్యుడు కాసేపు సేద తీరే
ఆకాశం మబ్బులతో నిండి పోయ
వాడ వాడలా జల్లులా వాన కురిసే
ప్రకృతి జల్లుల ఒడిలో ఒదిగిన పోయే
పంటలకు కరువు భయం పోయే
పాడి పంటలతో నిండిపోయే
ప్రకృతిని చూసి ప్రేమికుల మనసు ఉరకలు వేసే
ప్రతి ఇంట ఆనందం తొంగి చూసే
తొలకరి జల్లులో ప్రకృతి మెరిసిపోయే

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!