వరము లాంటి శాపము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఉదండ్రావు రమణబాబు
పుట్టుట గిట్టుట కొరకే కదా
గీతాచార్యుడు చెప్పినట్టు
పుట్టిన ప్రతి మనిషి
మరణించక తప్పదు
మరణం ఎప్పుడనేది
తెలియక పోయినా
చావు భయం
వెంటాడుతూనే ఉంటుంది.
చావు గురించి
ముందుగా తెల్సుకోవడం
వరము లాంటి శాపము
అకస్మాత్తుగా మనిషి చనిపోతే
ఎన్నో నిజాలు తనతోటే
సమాధి అయిపోతాయి.
మరణం గురించి ముందుగా తెలిస్తే
తమవారికి దిశా నిర్దేశం చేయవచ్చు
గాని కళ్ళముందు
చితి మంటలు కనిపిస్తుంటే
చెవిలో చావు మేళా వినిపిస్తుంటే
తట్టుకునే ఆత్మ స్థైర్యం ఉండాలి.