మంత్రాల సాక్షిగా
రచన: సుజాత.కోకిల
వేద మంత్రాల సాక్షిగా
బంధుమిత్రుల సాక్షిగా
వేశావు నా మెడలో మూడు ముళ్లు
నీతో నడిచాను ఏడడుగులు
నా చిటికెన వేలు పట్టుకుని
జీవితాంతం నాకు తోడుగా
ఉంటానని నీ చేయిని అందించావు
నా కష్ట సుఖాలలో తోడునెై నీడనై
నా వెంటెే ఉంటానని చేశావు వాగ్దానం
నీ తొలి స్పర్శతో నా మనసు పులకరించిoది
నీతో ఎన్నో కొత్త వలపులు పండించుకోవాలని
నాలో చిగురించిన కోటి ఆశలు
నీతో పంచుకోవాలని నీతో అడుగులు వేశాను
నాలో యవ్వన గాలి వీచిన వేళలలో
నీతో నా ఆనందాన్ని పొందాలని
నాతొలి అడుగులు నీవెంటే చేశాను
కన్న పేగును కడుపులో దాచుకొని
నాచేయి పట్టుకొని నీ చేతిలో
అప్పగిస్తున్న వేళలలో నా తల్లిదండ్రుల కళ్లల్లో
ఆ కన్నీటి ధారలు కట్టలుగా కారుతున్న వేళ కన్నీటిధారల్లో నా మనసు వికలమైన బాధతో
నా పెనిమిటితో అడుగులు వేస్తున్న వేళ
ప్రతి ఆడదానికి తప్పని బాధే కదా