అంశం : హాస్యకవిత
బ్రహ్మాండం బద్దలైపోయింది
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: జి.ఎల్.ఎన్.శాస్త్రి
ఆ గుండాయన్నాననాలి,
ఆయన సొమ్మేపోయింది బంగారం కొనoడి క్షయం ఉండదు,
డబ్బులు ఉరికేరావు ఎంతో చవక,
ఈ రోజు కొంటె తరుగుండదంటూ
నా గుండె తరిగేస్తాడు,
నీ బ్రహ్మాoడం బద్దలైపోతుంది
నువ్వు బాదుషా వైపోతావు,
కులీకుతుబ్షా వైపోతావoటాడు.
నా బంగారం ఊరుకుంటుందా!
తాను హేమామాలినిలా
తయారయ్యి,
నన్ను హమాలీగా మార్చేస్తుంది.
నాది కూలీ బతుకే
అన్నా వినదే,
షేపే లేని నన్ను,
నువ్వు మహేష్ వంటుoది,
నీదొక పేషీ అంటుంది,.
అది వ్యాపారుల కుట్రే అంటే,
నువ్వు తక్కువ వాడివా
మా నాన్నను మోసం చేసి,
నన్ను మనువాడలేదూ
అంటూ పాత పురాణాలు
ఆమెతో పేచీ ఎందుకని వెళ్ళానా
తరుగని, GST అని జేబు ఖాళీ.
దానమిచ్చినా,
పూజించినా
ఆక్షయమే నంటే వినదు.
బంగారమని
నా జేబు ఖాళీ
చేయించేస్తుంది.
ఆవిడ ఖుష్, నా బతుకు హుష్ .