అడుగుజాడలలో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దోసపాటి వేంకటరామచంద్రరావు
అడుగుజాడలలో నడవాలంటే ఆదర్శవంతులేరి
అడుగుముందుకు వేయాలంటే ప్రోత్సాహించేవారేరి
అడుగడుగునా అవినీతిపరులే
అసూయపరులే
అన్యాయాక్రమాలు చేసేవారే
ఆశయమంటే తెలియనివారే
అవకాశవాదులే
చరిత్రహీనులే
చెదపురుగులే
చేటుచేసేవారే
చేతకానివారే
కపటవేషదారులే
కరకుగుండెకలవారే
కళ్ళున్న కబోదులే
ఎవరి అడుగుజాడలలో నడవాలి
ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి!