ఎవరిదీ పాపం

ఎవరిదీ పాపం

రచయిత :: యం.సుశీలరమేష్

సస్యశ్యామలంగా విలసిల్లే భరతావని ,
మృత్యు రోదనతో అల్లాడుతుంది అవని,
ఉపాధి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది.
ఎటు చూసినా నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది.
ముందుచూపు లేని నాయకుల పాలన.
బడుగు జీవుల ఆకలి రోదన.
అస్తవ్యస్తమైన చిరు వ్యాపారుల సంపాదన.
అధిక ధరల బాదుడు.
ప్రైవేటు ఆసుపత్రి నిలువుదోపిడి.
గాడితప్పిన సామాన్యుడి జీవితం.
చిత్రం చూసినట్లు చూస్తుంది ప్రభుత్వం.
మరుభూమి సైతం కన్నీరు పెడుతుంది.
మృతదేహాలను చూడలేక.
ఎవరిదీ పాపం ఎక్కడిదీ శాపం
మానవుని నిర్లక్ష్యమా.
దైవాల జూద మా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!