మా తోనే ఉండాలి

(అంశం:: “నా ప్రేమ కథ”)

మా తోనే ఉండాలి 

రచన:జీ వీ నాయుడు

రాణి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. లక్ష రూపాయల జీతం. హైదరాబాద్ లో ఉద్యోగం. చిన్న వయసు లోనే తండ్రి ని కోల్పోయారు. ఒక్కగా ఒక్క కూతుర్ని తల్లి అల్లారు ముద్దు గా పెంచింది. రాణి తల్లి సుగుణ. పేరు తగ్గట్లే ఆమె సుగుణ వతే. భర్త లేరని ఆమె తన అత్త మామ లను తల్లిదండ్రులు కన్నా మిన్న గా
చూసే వారు. అప్పుడు అనుకుంది రాణి. తాను కూడా అత్త మామ లను తల్లిదండ్రులు కన్నా గొప్పగా చూసుకోవాలి అని అనుకుంది.
సుగుణ కు తాను కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి అత్త మామ లపైన ఆడబిడ్డలపైన అపారమైన అనురాగం, ఆప్యాయతలు ఉండేవి. కనీసం భోజనం కూడా వారి బెడ్ రూమ్ లోనే సమకూర్చే వారు. ఆరోగ్యం సహకరించని సమయం లో ఎలాంటి విసుగు లేకుండా అన్ని పరిచర్యలు సొంత కూతురు కన్నా మిన్నగా చేసే వారు సుగుణ. చుట్టాలు సైతం సుగుణ పరిచర్యలకు మురిసి పోయేవారు. శుభ అశుభ కార్యాలల్లో అన్ని తనే అయి నిర్వహించడం సుగుణ గొప్పతనం.
తల్లి పెంపకంలోనే రాణి అన్ని మంచి గుణాలను ఆకలింప చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే రాణి, తాను అన్నింటా రాణినే అనే స్థాయిలో రాణించారు. ఇంజనీరింగ్ కళాశాలలోనూ తాను ఎవరికీ తీసిపోను అని ప్రత్యేకత ను చాటుకున్నారు. ర్యాగింగ్ చేసేందుకు సీనియర్లు తన వద్దకు వస్తే, నేనూ మీ చెల్లినే గా ఎలా చేసుకుంటారో ఆలా గే చేసుకోండి అని చెప్పిన సుగుణ కుమార్తె ఆ కళాశాల కే వన్నె తెచ్చారు.
ఇక ఉద్యోగం లో చేరాక ఆ కంపెని యాజమాన్యం మొత్తం రాణి విధానాలకు ముగ్దు లయ్యారు. ఒక రోజు తన విధి నిర్వహణలో సాంకేతిక లోపం కారణంగా ఆరోజు చేయవలసిన పని పూర్తి కాకపోవడంతో అర్ద రాత్రి వరకు ఒంటరిగా ఆఫీస్ లో నే ఉండి పని పూర్తి చేసుకొని శహాభాస్ అని పించుకున్నారు. విధి నిర్వహణ లో ఆమెకు ఆమె సాటి అని యాజమాన్యం రాణికి ప్రత్యేక బోనస్ కూడా ప్రకటించారు.
ఆమె అందచందాలు, గుణగణాలు చూసి పలువురు వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
అదే కంపెనీ లో సీనియర్ ఇంజనీర్ రాము ఒక రోజు భోజనం చేసే సమయం లో ఆమెను తీక్షణంగా పరిశీలించారు. వారం రోజులు గడిచాక ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పారు రాము. ” మా కంపెనీ లో రాణి అనే జూనియర్ ఇంజనీర్ ఉన్నారు. ఆమె అన్నింటిలో విలక్షణం. ” అంటూ మొత్తం రాము కు రాణి ఫై ఉన్న అభిమానం గురించి చెప్పారు.
రాము తల్లిదండ్రులు నుంచి అనుమతి పొంది, ఒక రోజు రాణితో వివాహ ప్రయత్నం గురించి చెప్పారు. ” మీ తల్లిదండ్రులను మా ఇంటికి వచ్చి మాతల్లి బంధువులతో మాట్లాడ మని చెప్పండీ. నా కండీషన్ కు ఒప్పుకుంటే అలాగే ” అని బదులిచ్చారు రాణి.
” నేనూ మిమ్మల్ని ఇక్కడ రోజూ చూస్తున్నా, మీ గురించి అన్నీ తెలుసుకున్నాను. మీతల్లిదండ్రులు నా షరతులకు ఓకే అయితే మన వివాహం జరుగుతుంది ” అని రాణి తనలో ని భావన చెప్పారు.
మొత్తం మీద ఓ మంచి రోజు రాము తన తల్లిదండ్రులు కలసి రాణి వారి స్వగృహం చేరుకున్నారు.
అబ్బాయి, అమ్మాయి కొద్దీ సేపు ఏకాంతంగా మాట్లాడుకోండి. అనంతరం అన్ని విషయాలు మాట్లాడదాం అని రాము తండ్రి అశోక్ చెప్పారు.
పెళ్ళి కూతురు లాగా ముస్తాభైన రాణి నీ తల్లి సుగుణ అలాగే మాట్లాడించండి అని బదులిచ్చారు.
వెంటనే రాణి తాను కూర్చున్న సోఫా లోంచి లేచి అందరికి నమస్కరించారు. రాము తండ్రి అశోక్ వద్దకు వెళ్లి ఆయన కు పాదాభివందనం చేశారు. ” నేనూ ప్రత్యేకంగా మాట్లాడేది ఏమీ లేదు. నా కండీషన్ ఒక్కటే. మా వివాహం జరిగితే అత్తా మామ లు మాతోనే ఉండాలి. రాము ప్రత్యేక కాపురం పెట్టాలి అన్నా కూడా మీరు అంగీకరించ కూడదు. నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులు గానే చూసుకుంటా. మాతల్లి కూడా నా దగ్గరే ఉంచుకుంటా. నేనూ ఉద్యోగం చేస్తాను. రాముకు అన్ని విధాలా తోడుంటా. అత్త మామ లను ఎలా గౌరవించాలో మా తల్లిని చూసి నేర్చుకున్నా. ” అంటూ రాణి ముగించారు. ఒక్క సారి రాము తల్లి దండ్రులు ఆశ్చర్యానికి లోన్నయ్యారు. ఇంత మంచి కోడలు దొరకడం మా అదృష్టం అని అందరు సంతోషం గా వివాహ ఏర్పాట్ల లో నిమగ్నం అయ్యారు. ” ఇది నా ప్రేమ కథ ” అంటూ రాణి వివాహం అనంతరం రాముతో పంచు కున్నారు.

………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!