నా ప్రేమజీవితగమనం

(అంశం:: “నా ప్రేమ కథ”)

నా ప్రేమజీవితగమనం 

రచన: జయకుమారి


ప్రతి మనిషి జీవితంలో ప్రేమ ఉంటుంది.
అస్సలు మన పుట్టుక మూలం క ూడా ప్రేమే కదా,అదేనండి మన అమ్మానాన్నల ప్రేమ అండి.
మన పుట్టుకే ప్రేమతో మొదలైనప్పుడు ఇక ప్రేమ లేని జీవితం అంటూ ఉంటుందా. కచ్చితంగా ఉండదు.
ప్రతి దశ లోని ఎవరో ఒకరి ప్రేమ మనల్ని కట్టి పాడేస్తుంది.
అది అమ్మనాన్నలు,తోబుట్టువులు,స్నేహితులు ఎవరైనా  వారి ప్రేమకు బందీ కావలిసిందే.
అలాగే అందరి  ప్రేమను పొందిన నేను వయస్సుకు వచ్చిన తరువాత ఒక ప్రేమ ఎదను చేరి నా లోకాన్ని నాకే కొత్త గా చూపుతుంది అని అస్సలు అనుకోలేదు.
మా అమ్మనాన్నల ప్రేమ ,నాకు ప్రేమ అంటే ప్రేమ కలిగేలా చేసింది.
కాని ఆ పసిప్రాయంలో పుట్టే ప్రేమ ఆకర్షణ, లేక నిజమైన ప్రేమ  కాదు అన్న పెద్దల మాట నా మనస్సులో బలం గా నాటుకు పోయింది.
నా మనస్సులోని ప్రేమ పెదవి గడప దాటలేకపోయింది చదువు,ఉద్యోగం వచ్చేవరకు
ప్రేమ పెళ్ళి జోలికి వెళ్ళకూడదు అనుకున్నా.
ఎన్ని సార్లు నా మనస్సు ప్రేమ వైపు లాగిన, నే చదువు వైపుమళ్లించే దాన్ని, అలా డిగ్రి లో ఉండగా నాన్న ఒక సంబంధం తెచ్చి పెళ్లి అన్నారు, నే చదువు అన్నాను.
నా బాధ ఎవరు అర్ధం చేసుకోలేదు,పట్టించుకోలేదు,పరువు ప్రతిష్ఠ అన్నారు.
నాకన్నా,నా చదువు, నా ఇష్టాలు కన్నా పంతం ఎక్కువ అయ్యింది.
నాన్న పరువు కోసం,తల్లిదండ్రులు ప్రేమ కోసం.
నా ప్రేమ పెదవి గడప దాటకముందె.
నా గుండెగూటిలో శాశ్వతంగా సమాధి చేశాను.
తాళి కట్టిన వారు చదువుకున్నవారు కదా నా లక్ష్యం ,ఇష్టం ను  అర్ధం చేసుకుంటారు అనుకున్న, కానీ  అక్కడ కూడా చుక్కఎదురైంది. మౌనంగా భరించడం తప్ప వేరే దారిలేకపోయింది.
నా ఆశలు,ఆశయాలు కూడా నా ప్రేమలా ముగబోయి మౌనంగా రోధించడం లో జతకలిసి పోయాయి.
నా మనస్సును శిల లా మలిచి,అన్ని మరచి వంటింటి దాసి గా మారి.
నా జీవితాన్ని ,ఆశయాన్ని మరచి న మనస్సుకు
ఒక స్నేహం  నాలోని ఆలోచనలకు అక్షరాల బాట వేసింది.
ఆ బాటలో నెమ్మదిగా బుడి బుడి అడుగులు వేస్తూ నా ఆలోచనలకు కొత్త  రంగులు అద్ది ఇంద్రధనుస్సు లా మలిచి చూడాలి అనిపించింది.
శిల లాంటి జీవితాన్ని శిల్పం గా మలుచుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది అనే ఓ కవితాక్షరం నాలో ఉన్న ఊహాలకు రెక్కలు తొడిగాయి.
మళ్ళీ నా ఊహలోకం లోకి ఎగరాలన్న కోరిక మొదలైంది.
ఈ సారి నే ప్రేమ గా ప్రేమించే నా సంగీతం కోసం,నా ఉద్యోగం కోసం ,నే పంచప్రాణాలైన పిల్లల కోసం , నాకు ఓ రూపాన్ని ఇచ్చిన కవిత కోసం బ్రతకాలి అనిపించింది.
ఎన్ని మాటలు తూటాల్లా నను గుండెను చేరినా నా ఆత్మవిశ్వాసం ను కవచం గా మలుచుకొని.
సమాజంలో ఆడ వాళ్ళ మీదా ఉన్న చులకన భావం ఒక వైపు,అత్తమామలు,తాళి కట్టిన వాడు ఒక వైపు నా దారిలో ముళ్ళ కంపలు వేస్తున్న వాటి అన్నిటిని తొలగించుకుంటూ నా ప్రయాణం మొదలు పెట్టాను.
చూడాలి నా ఒంటరి ప్రయాణంలో  నేను కోరుకున్న ఆశల తీరాలు చేరగలనో లేదా మళ్ళీ బంధాల వలలో చిక్కుకు పోయి మళ్ళీ మూగబోయిన వీణలా మూలన పడతానో.
లేక  వసంతాలు తెచ్చే ఆమనిలో తీయ్యని రాగాలు పలికే కోయిలైన లోకానికి  మరులు గొలిపే ఆనంద మాలికల వలపుల సరగాలు ఆలపిస్తానో చూడాలి.
కానీ నాకో విషయం చెప్పాలని ఉంది.
పెళ్ళి, ప్రేమ అనేవి మనస్సుకు సంబందించనవి.
మనస్సు లు కలిసిన మనువే ఆ బంధాన్ని కడదాకా నిలిపి ఉంచుతుంది.
నాకో చిన్న సందేహం. ఏమి అనుకోవద్దు.
మనస్సులు కలవకుండా తనువులు కలిసిన వివహబంధమంలో సంతోషంగా ఉంటామా.
లేక మనస్సులు కలిసి తనువులు కలవని ప్రేమ బంధమంలో సంతోషం గా ఉంటామా.
నాకు అర్ధం కాక అడుగుతున్న అంతే అండి.
కానీ నా ఉద్దేశంలో ప్రేమ మనిషిని నడిపే జీవనగమనం.
ప్రేమ తోడు ఉంటే ఏదైనా సాదించగలం.
ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది.
ప్రేమ సంతోషన్ని ఇస్తుంది.
ప్రేమ జీవితాన్ని ఇస్తుంది.
ఎందుకంటే ప్రేమ అమృతతుల్యం
ప్రేమ సుమధురం
ప్రేమే నిత్యం
ప్రేమే సత్యం.
నా ప్రేమ కథ లో విజయం లేకపోయినా.
నా విజయంలో నా ప్రేమను నింపుతున్న.
ఇది అండి నా ప్రేమజీవిత గమనం.

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!