ఆదర్శవంతమైన తండ్రి

(అంశం:: “నా ప్రేమ కథ”)

ఆదర్శవంతమైన తండ్రి 

రచన:సుజాత (కోకిల)

అది ఒక రంగుల ప్రపంచం. ఆడపిల్ల.వయస్సు చాల చెడ్డది.వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు పెరుగుతుంటాయి.ఆ వయస్సు ప్రభావం ప్రేమలో పడ్డ ఆడపిల్లకి కోరికలు గుర్రాలై పరుగులు తీస్తుంటే అది ఆపాలని చూసినా ఎవరి తరం కాదు. ఆ ఊర్లో గోపీశర్మ అరుంధతి దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు తండ్రికి తగ్గ పిల్లలు ఆచార వ్యవహారాలలో నిష్టాగరిష్ఠుడు పిల్లలను కూడా చాలా చక్కగా పెంచాడు వారికి గౌరవ మర్యాదలు చాలా ఉన్నాయి ఆ ఊర్లో

ఈ కాలంలో చదువులు ముఖ్యమని చదివించారు. పిల్లలు కూడా తండ్రి.అడుగు జాడల్లోనే నడిచారు ఆడపిల్లలు అయినా తనకు మొగ పిల్లలు లేరని తన వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం కూడా నేర్పించారు చక్కగా ఒంటబట్టింది.ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసిమెలిసి ఉంటారు తల్లికి అనుకూలంగా ఉంటారు అలాంటి పిల్లలెే ఒకరోజు ఇంట్లో నుండి కనిపించకుండా పోయారు.అక్కడ ఇక్కడ ఆరా తీస్తున్నంతలో ఒక్కరోజు హఠాత్తుగా పోస్ట్ అన్న కేక గట్టిగా వినపడింది అది ఏంటా అని కంగారుగా విప్పి చూసేసరికి కాళ్ల కింద ఉన్న భూమి కంపించినట్టయింది మెదడులోని నరాలు చిట్లి నట్టనిపించింది ఒక్కసారిగ కళ్లు చీకట్లు కమ్మి కుప్పకూలిపోయాడు ఏవండీ అంటూ అరుంధతి పరుగెత్తుకుంటూ వచ్చి ఎందుకు ఇలా అయ్యారు ఆ ఉత్తరంలో ఏముందబ్బా అనుకుంటూ ఉత్తరం తీసుకుని చదివింది.తనకు కూడా అలాగే అనిపించింది.

అయ్యో దేవుడా మాకేంటిి ఈ పరీక్ష అంటూ లబోదిబోమంది ఏవండి ఏవండీ లేవండి అంటూ అరుంధతి లేవదీస్తుంది.కానీ ఉలుకు పలుకు లేకుండా పడిఉన్నారు.పక్కనున్న మర్రి చెంబులో నుండి నీళ్ళు తెచ్చి మొహం మీద చల్లింది.మెల్లిగా కళ్ళు తెరిచారు
ఏంటండీ మనకి ఈ పరీక్ష అంటూ ఏడుస్తుంది.మన ఖర్మనెే మనం ఏ జన్మలో చేసుకున్న పాపమో మనం ఇలా అనుభవిస్తున్నాము అంటూ మౌనంగా పిచ్చిచూపులు చూస్తూ అలా వుండిపోయారు. మనం తల ఎత్తుకొని మన మొహం నలుగురికేలా చూపిస్తాం అంటూ బాధపడుతున్నారు.

ఇద్దరి పిల్లలని అల్లారు ముద్దుగా కష్టమనేది తెలియకుండా పెంచి పెద్ద చేసారు మంచి చదువులు చదివించారు ఏనాడూ ఏ లోటు లేకుండా చేశారు ఈ
అప్రతిష్ట పని ఆ నోటా ఈ నోటా ఎప్పటికైనా తెలుస్తుంది దాస్తే దాచే విషయం కాదు ఎన్నాళ్లు ఇలా మౌనంగా ఉంటాము అనుకుంటూ పిల్లలు చేసిన పనికి మానసికంగా కుంగిపోయారు. ఏదో ఒకరోజు అందరికీ తెలుస్తుంది ఎదుటి వారు అనే మాటలను మనం భరించలేం ఇక్కడ ఉన్న ఇల్లు పొలాలు అన్నీ అమ్ముకొని వేరే ఊరికి వెళ్లారు.మనం ఎక్కడ ఉన్నా ఆ బాధ నిప్పులా మనల్ని కాలుస్తూనే ఉంటుంది.

అయినా చేసేది లేక మనసులను దిటవు చేసుకుని కాలం గడుపుతున్నారు అలా వారాలు రోజులు నెలలు సంవత్సరం గడిచిపోయింది.ఒక రోజు ఉదయమే పేపర్ చదువుతూ కుర్చీలో కూర్చున్నాను హఠాత్తుగా పెట్టేబేడా సర్దుకొని తన కూతురు ఎదురుగా వచ్చి నిలబడింది.ఏం అనాలో ఏం మాట్లాడాలో అర్థంకాలేదు లోపల ఉన్న అరుంధతిని పిలిచాను ఏవండీ వస్తున్నానండి కాఫీ పెడుతున్నాను అంటూ కాఫీ పట్టుకొని వచ్చింది.ఏంటండీ అలా అరుస్తున్నారు అంతలా అంది.

.తను అటువైపు చూస్తున్నారు ఏంటా అని నేను కూడా అటు వైపెే చూశాను తన కూతురు పెట్టేబేడాతో నిలబడి వుంది దిగ్భ్రాంతి చెందాను.తన వైపు చూశాను ఏం చేద్దామని అన్నట్టుగా అది నన్ను చూడగానే నా కాళ్లు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది
అమ్మా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ రోదిస్తోంది నా కడుపు ద్రవించిపోయింది తల్లి మనసు కదా ఒక్కసారిగా దుఃఖం ఆగలేదు అక్కున చేర్చుకుని కాసేపు ఇద్దరం ఏడ్చాము.

లోపలికి తీసుకు వెళ్లు అన్నట్లుగా సైగ చేశారు చేసేది లేక లోపలికి తీసుకువెళ్లాను. తండ్రి లోపలికి వస్తు
ఇలా ఎందుకు చేశావంటూ ఇద్దరు నిలదీసి అడిగారు.ఇక్కడి నుండి వెళ్లిన దగ్గరనుంచి వచ్చే దాకా అన్ని విషయాలు వివరంగా చెప్పింది.తల్లిదండ్రుల మనసు కద విని చాలా బాధపడ్డారు చెప్పకుండా కడపదాటిన ఆడదాని పరిస్థితి ఈలాగే ఉంటుందమ్మా తెలిసి చేశావో తెలియక చేశావొో కానీ ఇప్పుడైనా వాడిని వొదిలించుకుని మంచి పని చేశావు ఇప్పుడు మేము చెప్పినట్టు చక్కగా విను అని బాధపడుతూ చెప్పారు నీవు మంచిగా చదువుకున్నావు నీ తెలివి ఏమైందమ్మా ఒక్కమాటైనా మాకు ముందుగా చెప్పాలి కదా అంటూ తల్లి బాధపడింది.

మళ్లీ వాడు వచ్చిన వాడి వైపు కన్నెత్తి చూసిన వాడితో మాట్లాడిన మేం మాత్రం దగ్గరికి చేరనివ్వం అది ముందు ఆలోచించుకోని మాట్లాడు ఒక్కసారి దెబ్బ తిన్నాక మళ్లీ అదే తప్పు చేయకూడదు.అలాగే నాన్నా మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అంది మంచిగా చదువుకున్న అమ్మాయి కనుక మళ్ళీ అదే కాలేజీలో మళ్లీ జాయిన్ చేశారు.అమ్మా ఏకాగ్రతగా చదువుకొో ఆ చదువే నీ ఉనికిని తెలియజేస్తుంది మంచి స్థితిలో ఉంటావు అంటూ ఇప్పుడు నీకు చదువే ముఖ్యం బాధగా చెప్పసాగాడు తండ్రి పాత విషయాలు మర్చిపో అమ్మా నేను ఇంతకంటే ఏం చెప్పలేను.అలాగే నాన్నా నన్ను క్షమించండి మిమ్మల్ని బాధపెట్టినందుకు అంది మంచి చెడ్డలు చెప్పి హాస్టల్లో దింపివచ్చారు.

మంచి తలరాత ఉంటే ఎంత చెడు లో వున్న మంచి స్థితికి వస్తారు. నా కూతురు విషయంలో కూడా అలాగే మంచి జరిగింది గతం గతహా అనుకోని మంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంది.పాత విషయాలన్నీ మర్చిపోయి ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని సాఫీగా నడుచుకుంటుంది.ఒకరోజు చిన్నమ్మాయి ఫోన్ చేసింది.
నాన్న నీకు మనవడు పుట్టాడు నాన్న నిన్ను చూడాలనివుంది మీరు రమ్మంటే వస్తాను మీ అల్లుడు నన్ను బాగానే చూస్తున్నాడు నేను చేసిన పనికి నన్ను క్షమించండి నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అంటూ బాధగా ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది.

మనం ఎంత హోదాలో ఉన్న ఎన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తున్న పిల్లల మంచి చెడ్డలను కడుపులో దాచుకొని చూడడమే మన కర్తవ్యంగా భావించాను తండ్రిగా మన దగ్గరకి రానివ్వకుండా ఉంటే ఎండిన ఆకుల ఏటో కొట్టుకుపోతుంటే అది.చూసి మనం తట్టుకోగలమా చేసిన తప్పులను తవ్వుకుంటూ పోతే ఏమీ రాదు తప్పు తెలుసుకున్నాక క్షమించమని అడిగినప్పుడు మనం క్షమించడం మన కర్తవ్యం తప్పులు అందరూ చేస్తారు కానీ దానిని సరిదిద్దుకోని బాధ్యతగా నిర్వర్తిస్తున్నపుడు మనం చేయూత నివ్వాలి అప్పుడే మనం తల్లిదండ్రులుగా గుర్తింపబడతాము. అదే తప్పు మళ్లీ చేయకుండా చూడాలి.

మంచి ఆచారవ్యవహారాలలో పుట్టి పెరిగాను కానీ ఏం లాభం మన పాపకర్మలు మనల్ని పట్టిపీడిస్తుంటే మనం అనుభవించాలి తప్పదు అటు ఆచార వ్యవహారాలు ఇటు కన్న ప్రేమ ఏది గొప్పది అంటే ఏమీ చెప్పగలుగుతాము.నేను రెండు గొప్పవే అంటాను ఏ కన్ను గొప్పదంటే ఏం చెప్తాం ఒక మనిషిగా మానవత్వం ఉన్న తండ్రిగా నడుస్తాను అదే నా పిల్లల విషయంలో కూడా తండ్రి గా మంచి చేశాననే అనుకుంటున్నాను చిన్న బిడ్డ అల్లుడిని రమ్మని ఫోన్ చేశాను.

సంతోషంతో రెక్కలు కట్టుకుని వచ్చారు. తప్పఅయిందంటూ ఇద్దరు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.పెద్ద మనసుతో క్షమించడం నా కర్తవ్యంగా భావించాను అంతా దైవ నిర్ణయం నేను చేసిందేమీ లేదు వీళ్లకి ఇలాగే రాసిపెట్టి ఉంది.పిల్లలు బాగానే ఉన్నారన్న సంతోషం మిగిలింది.

దూరబ్బంధువు ఒకతను వచ్చి మీ పెద్ద అమ్మాయికి పెళ్లి చేస్తారా అంటూ అడిగాడు నేనేమీ చెప్పలేను మా అమ్మాయిని అడిగి చెప్తాను అన్నాను.అలాగే మంచి కుర్రాడున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు మీ గురించి అంతా చెప్పాను మీరు సరే అంటే చూడటానికి వస్తారు.అంటూ చెప్పాడు. చెల్లెలు మరిది వచ్చారని తెలియడంతో పెద్దమ్మాయి వచ్చింది. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అమ్మాయి నీకు పెళ్లి ఇష్టమేనా నీవు బాగా ఆలోచించి చెప్పమ్మా నీవు ఎలా ఎలాంటి సమాధానం చెప్పినా నాకు సమ్మతమే తల్లి అన్నారు నాన్న ఒకసారి తెలియక తప్పు చేశాను ఇప్పుడు తెలిసి తప్పు చేయను మీరు ఎలా అంటే అలాగే చేస్తాను నాన్న అంది చాలా సంతోషం తల్లి తన దూరపు బంధువుకు మా అమ్మాయికి ఇష్టమేనని కబురు పంపారు.

ఎక్కువ హడావుడి లేకుండా ఇరువురి బంధువుల సమక్షంలో పెళ్లి తంతు జరిపించారు అబ్బాయి కూడా చాలా మంచివాడు అన్ని విషయాలు ముందే తెలుసుకున్నాడు.తన కూతుర్ని అల్లుడి చేతిలో పెట్టి ఇక జీవితాంతం చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాయనా అంటూ మా అమ్మాయి తెలిసి తెలియక మిమ్మల్ని బాధపెడితే మంచి మనసుతో క్షమించు బాబు.అంటూ కళ్ళల్లో నుండి వచ్చేకన్నీటి.బొట్టును తుడుచుకుంటు ఆ దంపతులు ఇద్దరు అల్లుడికి అప్పగించారు.తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు. పిల్లలను కంటాం కాని వారి తలరాతలను కనలేము కద. అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి కలత చెందిన మనసుతో లోనికి వెళ్ళారు.పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని వదిలి వేయకుండా. ఆ తప్పును సరిదిద్ది సక్రమమైన మార్గంలో పెట్టి వారి జీవితానికి చేయూతను ఇవ్వాలి అదే మన కనిస బాధ్యత. మనసులో అనుకున్నాడు బాధగా.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!