దైవం
రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ
మనం దేముని నమ్ముతాం!
బాధకలిగితే వారికే చెప్పుకుంటాం!
ఆనందం మాత్రం ఆయనతో పంచుకోం!
దేముడు అన్యాయాన్ని
సహిస్తూ
అక్రమాలను సహిస్తున్నాడు!
చూస్తూ ఊరుకుంటున్నాడు
శిక్ష వేయడంలేదు
దాంతో
మరీపెరిగిపోతోంది
అక్రమం ,అన్యాయం
అంతులేని వ్యధ కలుగుతోంది
ఏంచేయలేక
చూస్తూ ఊరుకోలేక
ఎటూపాలుపోక
బాధ బాధ బాధ