(అంశం: ” పెంకి పెళ్ళాం”)
భార్యామణి
రచన :: పి. వి. యన్. కృష్ణవేణి
ముద్ద బంతి పువ్వు లాంటి అందం
మనసుని మురిపించే మంచి గుణం
తెరిచిన పుస్తకమే తన అంతరంగం
ఎంత చదివినా తరగదు ఆ కావ్యం
నా జీవితమే తానవ్వాలంటుంది
తన జీవితాన్ని అంకితమిచ్చింది
తన గుండె నిండా ప్రేమిస్తుంది
అంత ప్రేమ తిరిగి పొందాలంటుంది
స్వార్ధం తెలియని ప్రేమ తనది
పోటిలేని ఓర్పు తనకుంది
ఆ ప్రేమ మనకి చాదస్తంగ తోస్తుంది
ఆ ఓర్పు చూసే వాళ్ళకి అతి వినయంగా కనిపిస్తుంది
నాపై కోపగించుకుంటుంది
మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది
పెంకి పెళ్లామే నా భార్యామణి
ఆమె అలిగినా నాకు ఓ ముత్యమే