(అంశం:” ప్రమాదం”)
ప్రమాదం అంచుల్లో మనం
రచన::శ్రీదేవి విన్నకోట
అమ్మో నేడు,ప్రపంచాన్ని చూస్తుంటే భయమేస్తుంది.
ఎటు చూసినా అడుగడుగున ప్రమాదాల మోతే,
ఓ పక్క కల్లోలం
సృష్టిస్తున్న కరోనా,
మరోపక్క ఆగకుండా కురుస్తున్న జడివాన.
ఓ చోట భూకంపాల
విలయ ప్రళయం.
మరోచోట మనుషుల్నే మరబొమ్మలుగా
చేసి ఆడే తాలిబన్ల పాశవికమైన ఆట.
ఎక్కడో కొండ రాళ్ళు జారిపడిన, మంచు మనుషుల్ని కమ్మేసిన,
అగ్నిపర్వతం బద్దలై
లావా విరజిమ్మిన,
జైలు గదిలో ఖైదీలు
అగ్ని సమాధి అయిన,
యాక్సిడెంట్ల రూపంలో మృత్యువు పలకరిస్తున్న,
ఇలా ఎన్నో ప్రమాదాల్లో
జనం శలభాలై
అంతమై పోతుంటే,
అమ్మో ప్రమాదాన్ని తలుచుకుంటేనే భయమేస్తుంది,
ప్రకృతి విలయతాండవం ఎప్పుడు అంతమవుతుందో
అప్పుడే ప్రమాదాల జాడ మరిచి, ప్రమోదాలకై ఆశగా
వేచి చూడవచ్చు.
